Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న ఢిల్లీ, రాజస్థాన్..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

Delhi Capitals have won the toss and have opted to field, No Changes in Teams

ఐపీఎల్‌ - 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్‌‌తో నేడు తలపడబోతోంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో 7:30గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. పంజాబ్ కింగ్స్‌పై భారీ తేడాతో నెగ్గిన తరువాత రిషబ్ పంత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో కన్పిస్తుంది. ఆ జట్టు నెట్ రన్‌రేట్ మెరుగుపడింది. ఇవ్వాల్టి మ్యాచ్‌ గెలుపుపై కూడా కన్నేసింది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ 5లోకి ఢిల్లీ వస్తుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా కేకేఆర్‌తో జరిగిన గత హైస్కోరింగ్ మ్యాచ్‌లో గెలిచి ఫుల్ జోష్‌లో ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే టాప్-2లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ మాట్లాడుతూ.. బౌలింగ్‌కు అయినా, బ్యాటింగ్‌కు అయినా మేము సిద్ధంగా ఉన్నామన్నాడు. టాస్ ఓడినా మా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతామని, మేము గత తుది జట్టునే కొనసాగిస్తున్నామని తెలిపాడు. అలాగే ఢిల్లీ కెప్టెన్ పంత్ మాట్లాడుతూ.. టాస్ గెలవడంతో మేము తొలుత బౌలింగ్‌కు చేస్తామని తెలిపాడు. మేం ఈరోజు కూడా గత తుది జట్టునే కొనసాగిస్తున్నాం. 150 నుంచి 160లోపు కట్టడి చేయగలిగితే మా విజయవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నామన్నాడు.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (w/c), షిమ్రాన్ హెట్మెయర్, కరుణ్ నాయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (w/c), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

Story first published: Friday, April 22, 2022, 19:40 [IST]
Other articles published on Apr 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+