టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మరికొద్ది సేపట్లో తలపడబోతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
మార్పులు లేకుండానే:
ఈ మ్యాచ్‌లో రెండు జట్లు మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపు రుచి చూడలేదు ఆర్‌సీబీ. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా బోణీ కొట్టాలని బెంగళూరు జట్టు గట్టి పట్టుదలతో ఉంది. ఢిల్లీ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్లను సాధించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
పార్థివ్ పటేల్ (కీపర్), విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మార్కరస్ స్టయినిస్, మొయిన్ అలీ, అక్షదీప్ నాథ్, పవన్ నేగి, టీం సౌతీ, నవ్‌దీప్ సైనీ, యుజవేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
ఢిల్లీ క్యాపిటల్స్:
పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, రాహుల్ తెవాటియా , ఇన్‌గ్రామ్, క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, రబడా, ఇషాంత్, లమిచ్చనే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications