ఆర్సీబీ గెలవడమైతే గెలిచింది గానీ..
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సోమవారం రాత్రి ఢిల్లీలో ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ స్కోర్ ను అలవోకగా అందుకుంది. 81 బంతులు మిగిలి ఉండగానే దీన్ని ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయం. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లల్లో ఆరింట్లో నెగ్గింది ఆర్సీబీ. మొత్తం 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ ఒక్కడే టాప్ స్కోరర్. 33 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. అర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (3/5), జోష్ హేజిల్‌వుడ్ (4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించారు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్‌ధర్ సలామ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ (15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) అజేయంగా నిలిచారు. జాకబ్ బెథెల్ 11 బంతుల్లో ఫోర్, రెండు సిక్స్‌లతో 20 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో జరుగుతున్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 49 పరుగుల స్కోర్ సాధించగానే స్టేడియంలో సందడి నెలకొంది. ఆ జట్టు అభిమానులు "49.. 49" అంటూ ఒకేసారి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది.. ఆర్‌సీబీకి చెందిన చెత్త రికార్డును గుర్తుచేసింది. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 49 పరుగులకే ఆలౌటయ్యింది. ఇది టోర్నమెంట్‌లో అత్యల్ప జట్టు స్కోరు.
జట్టు స్కోరు ఎనిమిది పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో ఢిల్లీ కేపిటల్స్ 49 కంటే తక్కువ స్కోర్ కే ఆలౌట్ అవుతుందని ప్రతి ఆర్సీబీ అభిమానీ ఆశించాడు గానీ అది సాధ్యపడలేదు. ఆ లోయెస్ట్ స్కోర్ ను దాటేయడంతో అదే ఘన విజయం సాధించినంతగా సంబరపడిపోయారు.. ఢిల్లీ కేపిటల్స్ ఫ్యాన్స్. కొన్ని నిమిషాల పాటు ఆపకుండా "49.. 49" అంటూ గట్టిగట్టిగా అరిచారు. ఇది ఆర్సీబీని తలెత్తుకోనివ్వకుండా చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications