Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ నిజమైన వారసుడు అయ్యరే: ఢిల్లీ కోచ్ పాంటింగ్

Delhi Capitals coach Ricky Ponting finds Shreyas Iyer as rightful successor of Gautam Gambhir

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని శ్రేయాస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతమని ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ జట్టుకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం విశాఖవేదికగా జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

పాంటింగ్ మాట్లాడుతూ

పాంటింగ్ మాట్లాడుతూ

ఈ మ్యాచ్ అనతంరం పాంటింగ్ మాట్లాడుతూ "ఢిల్లీ జట్టుకు గతేడాది అనుభవజ్ఞుడైన గౌతం గంభీర్‌ కెప్టెన్‌గా ఉండేవాడు. గంభీర్‌కు ధీటుగా శ్రేయస్‌ కెప్టెన్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాడు. గౌతీ లేని లోటును శ్రేయాస్‌ పూరించాడు. అతడికి నిజమైన వారసుడిగా పూర్తి బాధ్యతలను పోషించాడు. తన బాధ్యతను నిర్వర్తించే సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురయ్యేవాడు కాదు" అని అన్నాడు.

మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్

మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 12వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో స్థానంతో ముగించింది. ఈ సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గానే కాకుండా ఇటు బ్యాటింగ్‌లోనూ ఫరవాలేదనిపించాడు. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచులాడిన శ్రేయాస్ అయ్యర్ 463 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అయ్యర్‌ మాట్లాడుతూ

అయ్యర్‌ మాట్లాడుతూ

ఇక, అయ్యర్‌ మాట్లాడుతూ "మేం అనుకున్న పరుగులు చేయలేకపోయాం. ఇన్నింగ్స్ ఆరంభం నిరాశపరిచింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో మంచి ఆరంభం లభించలేదు. చెన్నై జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు.. వాళ్ల బౌలింగ్‌లో పరుగులు చేయడం చాలా కష్టం. ఈ పిచ్‌ మాకు సహకరిస్తుందని అనుకున్నాం. ఇక్కడ గతంలోనూ ఒక మ్యాచ్‌ ఆడాం. అయితే మా జట్టులో ఏ ఒక్కరూ బాధ్యతగా ఆడలేదు. భాగస్వామ్యాలు కూడా నెలకొల్పడంలో విఫలమయ్యాం" అని అన్నాడు.

ఈ సీజన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నాం

ఈ సీజన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నాం

"ఈ సీజన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నాం. సొంత పిచ్ అయిన కోట్లా కూడా మాకు అంతగా సహకరించలేదు. ఆ పిచ్‌పై చాలా ప్రాక్టీస్ అవసరం. మేము ప్రొఫషనల్ క్రికెటర్లం కాబట్టి పిచ్‌ను నిందించలేం. టాస్‌ వేసే సమయాల్లో ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల పక్కన నిలబడటం అదృష్టంగా భావిస్తున్నా. వారు జట్లను నడిపించిన తీరు బాగుంది. వారిని చూసి కెప్టెన్‌గా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని శ్రేయాస్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, May 12, 2019, 12:08 [IST]
Other articles published on May 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+