ఐపీఎల్ 2021 ఆడకున్నా.. ఆ భారత ఆటగాడికి పూర్తి జీతం! ఎందుకో తెలుసా?

ఢిల్లీ: ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ నెల 26న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా ఆ వన్డే సిరీస్ నుంచి అతడు తప్పుకున్నాడు. అయితే అయ్యర్‌కు తగిలిన గాయం చాలా తీవ్రమైందని డాక్టర్లు తెలిపారు. ఏప్రిల్‌ 8న అయ్యర్‌ భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 120 నుంచి 150 రోజులు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు తేల్చేశారు.

ఐపీఎల్ 2021 ఆడకున్నా

ఐపీఎల్ 2021 ఆడకున్నా

ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరుగనున్నాయి. సర్జరీ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ మొత్తానికీ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఆడే సిరీసులకు కూడా అతడు అందుబాటులో ఉండడని టీమిండియా ఫిజియో చెప్పారు. అయితే శ్రేయాస్ ఐపీఎల్ 2021 ఆడనప్పటికీ.. అతనికి రూ.7 కోట్ల రూపంలో పూర్తి వేతనం రానుంది. దానికి కారణం 2011లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చిన ప్లేయర్ ఇన్సూరెన్స్ పాలసీనే అసలు కారణం.

ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం

ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం

భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లేయర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఓ ప్లేయర్ గాయం, యాక్సిడెంట్‌ కారణంగా ఐపీఎల్‌ టోర్నీకి దూరమైతే.. అతనికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి. అయ్యర్ ఒక కాంట్రాక్ట్ కలిగిన ఆటగాడు. అంతేగాక టీమిండియా తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆడుతూ అతడు గాయపడ్డాడు. అందుకే శ్రేయాస్ ఈ పరిహారం పొందేందుకు పూర్తి అర్హుడు. ఈ ఏడాది భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్‌ ఉంది. అయ్యర్ వేగంగా కోలుకుంటేనే.. మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కుతుంది.

కెప్టెన్‌గా పంత్‌

కెప్టెన్‌గా పంత్‌

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్‌ స్థానంలో యాజమాన్యం కొత్త సారథిని ఇటీవలే ప్రకటించింది. అతడే టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌. డిల్లీ కెప్టెన్‌గా పంత్‌ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా పంత్ సరైనోడని కితాబిస్తున్నారు. ఢిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, చెన్నై ఆటగాడు సురేశ్‌ రైనా, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్‌ అజహరుద్దీన్, టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌‌ సహా అనేక మంది పంత్‌ సారథిగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

చెన్నైతో తొలి మ్యాచ్

చెన్నైతో తొలి మ్యాచ్

శ్రేయస్ అయ్యర్‌ సారథ్యంలో గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడింది. తొలిసారి ఫైనల్ చేరింది. అయితే పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును ఎదుర్కోలేకపోయింది. గతేడాది ఫామ్‌ను ఐపీఎల్‌ 2021లోనూ కొనసాగించాలని ఢిల్లీ యాజమాన్యం ఆశిస్తోంది. ఏప్రిల్ 9న ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుండగా.. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో తలపడనుంది.

IPL 2021: 'ముంబైలో యథాతథంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. ప్రేక్ష‌కుల‌కు మాత్రం అనుమతి లేదు'

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, April 5, 2021, 15:52 [IST]
Other articles published on Apr 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X