Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 : కోహ్లీ తర్వాత ఆ ఫీట్ సాధించిన అందరినీ కొనేసిన ఫ్రాంచైజీ?

 Delhi Capitals bought Shefali Verma for a huge amount

ఐపీఎల్‌లో బలమైన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ఈ లీగ్ ప్రారంభమైన కొత్తలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఉన్న ఈ ఫ్రాంచైజీ.. ఆ తర్వాత తమ పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌గా మార్చుకుంది. టోర్నీలో బలమైన జట్లలో ఒకటిగా పేరొందింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మహిళల ఐపీఎల్‌లో కూడా అడుగు పెట్టింది. మహిళల ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును ఏర్పాటు చేసింది. ఈ టీంలోకి కొందరు కీలక ఆటగాళ్లను కూడా వేలంలో కొనుగోలు చేసింది. వీరిలో జెమీమా రోడ్రిగెజ్, షెఫాలీ వర్మ వంటి ప్లేయర్లు కూడా ఉన్నారు.

ఇక్కడే ఢిల్లీ ఫ్రాంచైజీ తను చాలా కాలంగా ఫాలో అవుతున్న రూల్‌ను కొనసాగించింది. ఇప్పటి వరకు అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా కెప్టెన్లు అందర్నీ ఢిల్లీ ఫ్రాంచైజీనే కొనుగోలు చేసింది. ఐపీఎల్ తొలి సీజన్లో విరాట్ కోహ్లీని మాత్రమే తమ జట్టులో చేర్చుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత కప్పు కొట్టిన టీమిండియా యువకెప్టెన్ ఉన్ముక్త్ చంద్, ఆ తర్వాత పృథ్వీ షా, చివరగా యష్ ధుల్‌ ముగ్గుర్నీ ఈ ఫ్రాంచైజీనే కొనుగోలు చేసింది.

ఈ క్రమంలో ఇటీవల ముగిసిన మహిళల అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత కెప్టెన్‌ను కూడా కొనుగోలు చేసింది. ఈ టోర్నీలో భారత్‌కు సారధ్యం వహించిన షెఫాలీ వర్మను మంచి ధరకు ఢిల్లీ ఫ్రాంచైజీ దక్కించుకుంది. మిగతా ఫ్రాంచైజీల నుంచి గట్టి పోటీ వచ్చినా ఎదుర్కొన్న ఢిల్లీ.. ఆమె కోసం భారీ ధర పెట్టింది. బేస్ ధర రూ.50 లక్షలతో వేలంలో నిలిచిన ఆమెకు రూ.2 కోట్లు చెల్లించి తమ జట్టులోకి తీసుకుంది. తొలి మహిళల ఐపీఎల్‌లో ఆమెకే జట్టు పగ్గాలు అందించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే చాలా కాలంపాటు ఆ జట్టు సారధ్య బాధ్యతలు షెఫాలీ చేతిలోనే ఉంటాయని అనిపిస్తోంది.

Story first published: Monday, February 13, 2023, 19:33 [IST]
Other articles published on Feb 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+