
లీగ్‌కు దూరం..
ఈ నేపథ్యంలోనే అతడు మిగిలిన మ్యాచ్‌లకు ఆడలేడని స్పష్టం చేశాడు. 'పృథ్వీ షాకు అసలు ఏం జరిగిందో నాకు స్పష్టమైన సమాచారం లేదు. అయితే, కొద్ది రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నాడు. అతడెంతో నాణ్యమైన ఆటగాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లపై ఆధిపత్యం చలాయించగల బ్యాటర్. అలాంటి ఆటగాడి సేవలు కోల్పోవడం మా జట్టుకు తీరని నష్టం. అతను త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నా. అయితే, లీగ్ స్టేజ్‌లో మాకు మిగిలిన రెండు మ్యాచ్‌లకు మాత్రం అతను అందుబాటులో ఉండడు' అని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.

టైఫాయిడ్‌తో..
ఇక పృథ్వీ షా టైఫాయిడ్ బారిన పడ్డాడని గత మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రిషభ్ పంత్ పేర్కొన్నాడు. పృథ్వీ షా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పృథ్వీ షా ఈ సీజన్లో చివరిసారి మే 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత జ్వరం బారిన పడటంతో.. హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో బరిలోకి దిగలేదు. అతని స్థానంలో మన్దీప్ సింగ్, కేఎస్ భరత్ అవకాశం దక్కించుకున్నా ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చలేకపోయారు.

పృథ్వీ లేకపోవడం లోటే..
ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. .. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలుపొంది ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది. అయితే, ఇతర జట్లు కూడా పోటీలో ఉండటంతో ఢిల్లీ మెరుగైన రన్‌రేట్ సాధిస్తేనే ప్లేఆఫ్స్ చేరుకునే వీలుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ లాంటి డాషింగ్ ఓపెనర్ మిగతా రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందికరమే. ఇక పృథ్వీ ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 28.78 సగటుతో 259 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి.