వేలానికి ముందే.. ఢిల్లీ జట్టులో మిగితా ప్లేయర్లు వీరేనట!!

న్యూ ఢిల్లీ: ఐపీఎల్ 2019పురస్కరించుకొని నూతనంగా ముస్తాబవుతోన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇటీవలే పేరు మార్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా అవతారమెత్తింది. ఇటీవల అంటిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన ఫ్రాంచైజీలు వేలం ద్వారా ఆటగాళ్లను భర్తీ చేసుకునేందుకు చూస్తున్న క్రమంలో డిసెంబరు 18న జైపూర్ వేదికగా జరగనున్న 2019 వేలం ద్వారా పూర్తి స్థాయి జట్టును తయారు చేసుకునేందుకు ఢిల్లీ జట్టు తహతహలాడుతోంది. ఈ క్రమంలో ప్రచారంతో పాటు అభిమానులకు వినోదాన్ని పంచాలని ఆలోచనలో ఉన్న జట్టు తమ జట్టులో పది మంది ఆటగాళ్లకు ఖాళీ స్థానం ఉంటే ఎవరెవరినీ ఎంచుకోవాలని అనుకుంటున్నారో పోస్టు చేయమంటూ ట్విట్టర్‌లో పేర్కొంది.
ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరు ఎక్కువగా
మరి కొద్ది రోజుల్లో వేలంకు వెళ్లనున్న క్రమంలో అభిమానుల నుంచి సలహాలు అడిగి తీసకుంది. వీరిలో చాలా మంది భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరు ఎక్కువగా కనిపించింది. కనీస ధర రూ.50లక్షలుగా ఉన్న పటాన్‌ను తీసుకునేందుకు జట్టులో అనుకూలంగా ఉన్నప్పటికీ జమ్మూ అండ్ కశ్మీర్ దేశీవాలీ లీగ్‌లో ఆడి తన పొరబాటు కారణంగా అక్కడి నిర్వహకులు చేతిలో ఫైన్‌ను శిక్షగా భరిస్తున్నాడు.
ఆలస్యంగా శ్రేయాస్ అయ్యర్ కూడా తమ జట్టులో
ఢిల్లీ జట్టు యాజమాన్యం ఆలస్యంగా శ్రేయాస్ అయ్యర్ కూడా తమ జట్టులో కొనసాగుతున్నాడంటూ శిఖర్ ధావన్‌తో పాటుగా ప్రకటించడంతో మిగిలిన ప్లేయర్ల పేర్లు ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి వచ్చిన విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, షెహబాజ్ నదీమ్‌లతో జట్టు కొనసాగనుంది. వీరితో పాటుగా రిక్కీ పాంటింగ్ అదే హోదాలో జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జట్టు పేరు మార్చినప్పటికీ లోగోలోని రంగులు మాత్రం వదల్లేదు. బ్లూ, రెడ్ రంగులతో కొత్త లోగోతో లీగ్‌లో అడుగుపెట్టనుంది.
పటిష్టమైన టాపార్డర్‌తో ఢిల్లీ జట్టు
ఇప్పటికే ఢిల్లీ జట్టు పటిష్టమైన టాపార్డర్‌తో కనిపిస్తోంది. పృథ్వీ షా, అయ్యర్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్‌లతో కూడిన యువ క్రికెటర్లతో జట్టు బలంగా ఉంది. ఢిల్లీ జట్టులో వేలానికి ఖర్చుపెట్టే విధంగా రూ.25కోట్ల వరకూ వెసలుబాటు ఉంది. బ్రెండన్ మెక్ కల్లమ్, క్రిస్ వోక్స్, డార్సీ షార్ట్ లాంటి ఆటగాళ్లు వేలంలో అందుబాటులో ఉండనుండటంతో కొనుగోలు చేస్తుందో లేదో వేచిచూడాల్సింది.
ఇప్పటివరకూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో క్రికెటర్లు వీరే:
రిషబ్ పంత్, క్రిస్ మోరిస్, శ్రేయాస్ అయ్యర్, కగిసో రబడా, అమిత్ మిశ్రా, రాహుల్ తెవాటియా, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ మున్రో, పృథ్వీ షా, ఆవేశ్ ఖాన్, జయంత్ యాదవ్, హర్షల్ పటేల్, మంజోత్ కల్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications