Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. గాయంతో టోర్నీ నుంచి స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఔట్‌

Delhi Capitals all-rounder Mitchell Marsh is likely to miss IPL 2022 due to injury

ఇండియ‌న్ ప్రీమియ‌ల్ లీగ్ (ఐపీఎల్ ) 2022 ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై విజ‌యంతో లీగ్‌ను ఘ‌నంగా ప్రారంభించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఇంత‌లోనే గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మెగా వేలంలో ఆ జ‌ట్టు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అత‌ను ఐపీఎల్ 2022 ఆడ‌తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా పాకిస్థాన్ ప‌ర్య‌ట‌న కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు మిచెల్ మార్ష్‌ ఢిల్లీ జ‌ట్టుతో చేర‌లేదు.

పాకిస్థాన్‌ ప‌ర్య‌ట‌న‌లో గాయం

పాకిస్థాన్‌ ప‌ర్య‌ట‌న‌లో గాయం

ప్ర‌స్తుతం పాకిస్థాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ గాయం కార‌ణంగా ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌కు పూర్తిగా దూర‌మ‌య్యాడు. ప్రాక్టీస్ సెష‌న్‌లో మార్ష్‌కు తొడ కండరాలు పట్టేసాయని ఆస్ట్రేలియా ప‌రిమిత ఓవ‌ర్ల టీం కెప్టెన్ ఆరోన్ ఫించ్ వెల్ల‌డించాడు. దీంతో అత‌ను పాకిస్థాన్‌తో ప‌రిమిత ఓవ‌ర్ల సిర‌స్‌కు దూరం కానున్న‌ట్లు అధికారికంగా ధృవిక‌రించాడు.

ఒక వేళ మిచెల్ మార్ష గాయం తీవ్ర‌మైన‌దైతే అత‌ను ఐపీఎల్ 2022కు పూర్తిగా దూర‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. కాగా ఇప్ప‌టికే సౌతాఫ్రికా ఆట‌గాడు ఆన్రిచ్ నోర్జే దూర‌మై నిరాశ‌లో ఉన్న ఢిల్లీకి మార్ష్ కూడా దూర‌మైతే ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలున్నాయి.

భారీ ధ‌ర‌కు కొనుగోలు

భారీ ధ‌ర‌కు కొనుగోలు

మెగా వేలంలో మిచెల్ మార్ష్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ 6.5 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. కాగా 30 ఏళ్ల మార్ష్ గ‌తేడాది ఆస్ట్రేలియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌పై 77 ప‌రుగుల‌తో చెల‌రేగాడు. గ‌తేడాది మొత్తం సూప‌ర్ ఫామ్‌లో ఉన్న మార్ష్ ఆ ఏడాది 36 స‌గ‌టుతో 627 ప‌రుగులు చేసి క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 21 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 225 ప‌రుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 20 వికెట్లు తీశాడు.

ముంబైపై విజ‌యం

ముంబైపై విజ‌యం

కాగా ఐపీఎల్ 2022ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఆ జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్‌పై 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 5 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిష‌న్ 81 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెల‌రేగ‌గా.. రోహిత్ శ‌ర్మ 46 ప‌రుగుల‌తో రాణించాడు. కుల్దీప్ యాద‌వ్ 3 వికెట్ల తేడాతో చెల‌రేగాడు.

ఇక ల‌క్ష్యాన్ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌రో 10 పంతులు మిగిలి ఉండ‌గానే చేధించి 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌లిత్ యాద‌వ్ (48), అక్ష‌ర్ ప‌టేల్ (38*), పృథ్వీషా (38) రాణించారు. కుల్దీప్ యాద‌వ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. అక్ష‌ర్ పటేల్, ల‌లిత్ యాద‌వ్ ఏడో వికెట్‌కు అజేయంగా 77 ప‌రుగులు జోడించి ఢిల్లీకి విజ‌యాన్ని అందించారు. ఢిల్లీ త‌మ తదుప‌రి మ్యాచ్‌ను ఏప్రిల్ 2న గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆడ‌నుంది.

Story first published: Monday, March 28, 2022, 18:49 [IST]
Other articles published on Mar 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+