
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022 యొక్క 50వ మ్యాచ్ నేడు రాత్రి 7.30కు జరగబోతుందనే సంగతి తెలిసిందే. ప్లే-ఆఫ్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఈ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు ముందు రిషబ్ పంత్ సేన లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఢిల్లీకి చాలా కీలకం కానుంది. ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్న డీసీ ఇప్పటివరకు ఆడిన 9మ్యాచ్‌ల్లో 4గెలిచింది, 5ఓడిపోయింది. ప్రస్తుతం 8పాయింట్లతో కొనసాగుతుంది. మరోవైపు నాలుగో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9మ్యాచ్‌లు ఆడగా 5గెలిచింది, 4మ్యాచ్‌ల్లో ఓడింది. సన్ రైజర్స్ 10పాయింట్లు సాధించి 5వ స్థానంలో కొనసాగుతుంది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ ఓడితే హ్యాట్రిక్ ఓటములు అవుతాయి. అలాగే ప్లేఆఫ్ రేసులో వెనకబడిపోతుంది. ఈ మ్యాచ్‌కు ముందు పలు రికార్డులు ఢిల్లీ, సన్ రైజర్స్ ఆటగాళ్లను ఊరిస్తున్నాయి.

ఈ మ్యాచ్‌కు ముందు సాధ్యపడే పలు మైలురాళ్లు
1. అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఐపీఎల్లో 100వికెట్ల క్లబ్‌లో చేరడానికి కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఇక ఈ ఢిల్లీ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లో 50క్యాచ్‌లకు 1క్యాచ్ దూరంలో ఉన్నాడు.
2. రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్) టీ20 క్రికెట్‌లో 4000పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 56పరుగుల దూరంలో ఉన్నాడు
3. నికోలస్ పూరన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) టీ20 క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా 100క్యాచ్‌లకు 3క్యాచ్‌ల దూరంలో ఉన్నాడు.
4.పృథ్వీ షా (ఢిల్లీ క్యాపిటల్స్) ఐపీఎల్లో 200ఫోర్లు బాదిన ప్లేయర్‌గా నిలవడానికి ఇంకా 10ఫోర్ల దూరంలో ఉన్నాడు.
5. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఐపీఎల్లో 50వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలవడానికి 4వికెట్ల దూరంలో ఉన్నాడు, అలాగే టీ20 క్రికెట్లో తన 250వ వికెట్ తీయడానికి కేవలం 1వికెట్ దూరంలో ఉన్నాడు.
6. డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్) టీ20 క్రికెట్‌లో 400 సిక్సర్ల మైలురాయికి చేరుకోవడానికి ఇంకో 2సిక్సర్లు కొడితే చాలు.
7. కేన్ విలియమ్సన్ (సన్‌రైజర్స్) టీ20ల్లో 100క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా నిలవడానికి మరో 2క్యాచ్‌ల దూరంలో ఉన్నాడు.