Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆదివారం ఢిల్లీ టెస్టులో ఏం జరిగింది: లంక ఆటగాళ్లు కావాలనే మాస్క్‌లు ధరించారా?

హైదరాబాద్: దేశ రాజధానిలోని కాలుష్యం తీవ్రత ఫిరోజా షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టుపై ప్రభావం చూపిస్తోంది. భారత్‌-శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు, రెండో రోజు ఆటగాళ్లు ముఖానికి మాస్కులు ధరించి మ్యాచ్‌ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచే పొగ మైదానాన్ని కమ్మేయగా.. మధ్యాహ్నానికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ముఖాలకు మాస్కులు ధరించి ఆడారు.

 ఢిల్లీ టెస్టులో లంక ఆటగాళ్ల అసౌకర్యంగా

ఢిల్లీ టెస్టులో లంక ఆటగాళ్ల అసౌకర్యంగా

లంచ్‌ విరామం తర్వాత మధ్యాహ్నం 12.32 ప్రాంతంలో లంక పేస్ బౌలర్ గమాగె దగ్గుతో.. బౌలింగ్‌ ఆపేశాడు. ఆ సమయంలో అశ్విన్‌ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. మిగతా ఆటగాళ్లు కూడా అసౌకర్యంగా కనిపించడంతో ఆట నిలిచిపోయింది. గాలిలో తగినంత నాణ్యత కరవైందని శ్రీలంక ఆటగాళ్లు అంపైర్లను సంప్రదించారు. ఆటను నిలిపివేయాలని కోరారు.

 ఐసీసీ నిబంధనల ప్రకారం అంఫైర్లు ఇలా

ఐసీసీ నిబంధనల ప్రకారం అంఫైర్లు ఇలా

ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఆట ఆపడం సాధ్యం కాదని లంక జట్టుకు అంపైర్లు తేల్చి చెప్పారు. ఆ తర్వాత చివరికి 17 నిమిషాల తర్వాత మళ్లీ ఆట మొదలైంది. లంక జట్టు మాత్రం ఆట కొనసాగించడానికి అయిష్టంగానే కనిపించింది. ఈ క్రమంలో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఫీల్డింగ్‌కు దిగారు. 25 నిమిషాల తర్వాత మళ్లీ ఆ జట్టు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేసింది.

 పెవిలియన్‌కు వెళ్లిపోయిన లక్మల్

పెవిలియన్‌కు వెళ్లిపోయిన లక్మల్

పేసర్‌ లక్మల్‌ ఓవర్‌ పూర్తి చేయలేక ఐదో బంతి వేయగానే.. పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఫిజియో వచ్చిన తర్వాత ఆటగాళ్లు అంపైర్లను సంప్రదించి మ్యాచ్‌ నిలిపివేయాల్సిందిగా కోరారు. ఆ సమయంలో భారత కోచ్‌ రవిశాస్త్రి మైదానానికి వచ్చి అంపైర్లతో మాట్లాడాడు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఆటను కొనసాగించారు. రెండోసారి ఆట ప్రారంభమైన తర్వాత కూడా లంక ఆటగాళ్లు మళ్లీ ఆటకు అడ్డుపడ్డారు.

 డ్రెస్సింగ్‌ రూం నుంచే కోహ్లీ డిక్లేర్

డ్రెస్సింగ్‌ రూం నుంచే కోహ్లీ డిక్లేర్

దీంతో శ్రీలంక ఆటగాళ్ల తీరుపై విసుగెత్తిన కోహ్లీ డ్రెస్సింగ్‌ రూం నుంచి చాలా ఆగ్రహంగా డిక్లరేషన్‌ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రెండో సెషన్ చివర్లో శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభమైంది. అయితే శ్రీలంక ఆటగాళ్ల మాదిరి భారత్ జట్టులోని ఆటగాళ్లు మాస్కులేమీ ధరించలేదు. అనంతరం తొలి బంతికే శ్రీలంక వికెట్‌ కోల్పోయినపుడు స్టేడియంలో ప్రేక్షకులు హోరెత్తించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మెరుగైన స్కోరు చేసే అవకాశం ఉన్నప్పటికీ.... ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయాలన్న నిర్ణయం తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురుస్తోంది.

Story first published: Monday, December 4, 2017, 10:36 [IST]
Other articles published on Dec 4, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+