For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైనల్‌లో ఓటమి.. కన్నీటితో ఢిల్లీ కెప్టెన్ (Video)

పాపం.. ఢిల్లీ క్యాపిటల్స్‌. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లోనూ ఫైనల్‌కు చేరింది. కానీ ముంబై ఇండియన్స్‌కు టైటిల్‌ దక్కింది. రెండో సీజన్‌లో కసిగా బరిలోకి దిగింది. ట్రోఫీని ముద్దాడాలని విజయాలతో హోరెత్తించింది. పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచి నేరుగా తుదిపోరుకు అర్హత సాధించింది. మళ్లీ అదే రిజల్ట్.

ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. అంతకుముందు వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ చేతిలో ఓడని ఢిల్లీ.. టైటిల్ పోరులో పరాజయాన్ని చవిచూసింది. ఒక్క టైటిల్ అయినా సాధించాలని 17 ఏళ్ల ఢిల్లీ ఫ్రాంచైజీ కల మరోసారి కలగానే మిగిలిపోయింది.

Defeat in the WPL final Delhi captain in tears Video goes viral

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాంక పాటిల్ (4/12) ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (44; 27 బంతుల్లో) టాప్ స్కోరర్.అయితే ఓ దశలో 64/0తో ఢిల్లీ మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత 49 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. షెఫాలీ వర్మతో పాటు మెగ్ లానింగ్ (23; 23 బంతుల్లో) నిలకడగా ఆడటంతో పవర్‌ప్లేలో 61 పరుగులు చేసింది. కాగా, సోఫీ మొలినెక్స్ వేసిన 8వ ఓవర్‌‌తో ఢిల్లీ కథ మారిపోయింది. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లింది.

114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎలీస్ పెర్రీ (35*; 37 బంతుల్లో), సోఫీ డివైన్ (32; 27 బంతుల్లో), స్మృతి మంధాన (31; 39 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రిచా ఘోష్ (17*; 14 బంతుల్లో) సత్తాచాటింది. మరోవైపు ఢిల్లీ బౌలర్లు, ఫీల్డర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ స్వల్ప లక్ష్యం కావడంతో విజయతీరాలకు చేరలేపోయారు.

మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఓటమి బాధను తట్టుకోలేకపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. టోర్నీ ఆద్యంతం సత్తాచాటి కీలక పోరులో తడబడిన ఢిల్లీ ప్లేయర్లు భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్‌గా మెగ్ లానింగ్ అయిదు వరల్డ్ కప్‌లు గెలిచింది. కానీ డబ్ల్యూపీఎల్ ట్రోఫీని అందుకోవడంలో విఫలమైంది. రెండు సార్లు ఆఖరి మెట్టుపై బోల్తాపడింది.

Story first published: Monday, March 18, 2024, 10:18 [IST]
Other articles published on Mar 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+