Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నరాలు తెగే ఉత్కంఠగా ఫైనల్‌: దీప్తి సిక్సర్‌‌తో ముగింపు (Video)

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల 'హండ్రెడ్' టోర్నీ-2024కు అదిరే ముగింపు దక్కింది. భారత క్రికెటర్ దీప్తి శర్మ సంచనల సిక్సర్‌తో తమ జట్టు 'లండన్ స్పిరిట్‌'ను ఛాంపియన్‌గా నిలిపింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దీప్తి ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటింది.

20 బంతులు వేసి 23 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టిన దీప్తి శర్మ బ్యాటుతోనూ మెరిసింది. తీవ్ర ఒత్తడిలో 16 బంతుల్లో అజేయంగా 16 పరుగులు చేసింది. లండన్ స్పిరిట్ జట్టు విజయానికి చివరి అయిదు బంతుల్లో ఆరు పరుగులు అవసరమయ్యాయి. హీలీ వేసిన తొలి రెండు బంతులకు దీప్తి, చార్లీ డీన్ చెరో సింగిల్ తీయడంతో విజయ సమీకరణం మూడు బంతుల్లో నాలుగు పరుగులుగా మారింది.

Deepti Sharma Clinches The Hundred Title for London Spirit with a Thrilling Six

ఈ దశలో దీప్తి శర్మ లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడింది. అయితే గాల్లోకి లేచిన ఆ బంతిని ఫీల్డర్ అందుకునేలా కనిపించింది. కానీ బంతి బౌండరీ రోప్ అవతల పడటంతో లండన్ స్పిరిట్ ఛాంపియన్‌గా అవతరించింది. 2021 నుంచి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో లండన్ తొలిసారి విజేతగా నిలిచింది. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ జట్టు 100 బంతుల్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.

జొనాసెన్ (54; 41 బంతుల్లో, 8 ఫోర్లు) అర్ధశతకం సాధించింది. ఎవా గ్రే, సారా గ్లెన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో లండన్ స్పిరిట్ 98 బంతుల్లో ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. జార్జియా (34; 32 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు తీసింది. కాగా,ఈ ఫైనల్‌లో ఒకే సిక్సర్ నమోదైంది. ఈ సిక్సర్‌‌తో దీప్తి మ్యాచ్‌ను ముగించింది.

Story first published: Monday, August 19, 2024, 10:17 [IST]
Other articles published on Aug 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+