Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపికా పదుకొణె ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరో తెలుసా?!!

Deepika Padukone Reveals Her All-Time Favourite Cricketer || Oneindia Telugu
Deepika Padukone says she watches cricket with Ranveer Singh: My all-time favourite cricketer is Rahul Dravid

ముంబై: బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ ఉన్న బ్యూటీ దీపికా పదుకొణె. సరైన కథలను ఎంచుకుని కెరీర్‌ను సాఫీగా సాగిస్తున్నారు. దీపికా తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులును సంపాదించారు. ఇక దీపికా పదుకొణె స్వతహాగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. దీంతో దీపికాకు క్రీడలంటే కూడా బాగా ఇష్టం. బ్యాడ్మింటన్‌తో పాటు నేరుగా మైదానానికి వచ్చి క్రికెట్ మ్యాచ్‌లు కూడా చూస్తుంటారు. ఐపీఎల్ ప్రారంభంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు.

చపాక్‌ ప్రమోషన్‌లో దీపికా బిజీ:

చపాక్‌ ప్రమోషన్‌లో దీపికా బిజీ:

దీపికా పదుకొణె తాజాగా నటించిన చిత్రం 'చపాక్‌'. ప్రస్తుతం దీపికా ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. చపాక్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఓ క్రికెట్‌ లైవ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్‌ 'ది వాల్' రాహుల్‌ ద్రావిడ్‌ తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని దీపికా తెలిపారు. తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి క్రికెట్ మ్యాచ్‌లు చూస్తానని అన్నారు.

 ద్రావిడ్‌ నా ఫేవరెట్‌:

ద్రావిడ్‌ నా ఫేవరెట్‌:

'రణ్‌వీర్‌ సింగ్‌ పెద్ద ఫుట్‌బాల్‌ ఫ్యాన్‌ అని అందరికి తెలిసిందే. అయితే క్రికెట్‌ను కూడా అంతే ఇష్టంగా చూస్తాడు. ఇద్దరం కలిసి కొన్ని మ్యాచ్‌లు చూస్తుంటాం. ఫుట్‌బాల్‌, క్రికెట్ రెండూ చూస్తాం. రాహుల్ ద్రావిడ్‌ సర్ నాకు ఇష్టమైన క్రికెటర్‌. బెంగళూరు చెందిన ఆయన ఎందరో మెచ్చుకొనే స్థాయికి ఎదిగారు' అని దీపిక పేర్కొన్నారు.

కపిల్‌ బయోపిక్:

కపిల్‌ బయోపిక్:

యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం చఫాక్‌. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. భారత క్రికెటర్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ బయోపిక్ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. దీనికి '83'గా నామకరణం చేశారు. ఈ సినిమాలో రణవీర్‌ సింగ్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో కనిపించనుండగా.. ఆయన సతీమణి రోమీ భాటియా పాత్రలో దీపికా నటిస్తున్నారు.

Story first published: Friday, December 13, 2019, 14:02 [IST]
Other articles published on Dec 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+