టీమిండియా ప్లేయింగ్ 11లో దీపక్ హుడాను తీసుకోవాలన్న సంజయ్ మంజ్రేకర్.. ఎందుకంటే?

జూన్ 26న ఆదివారం నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కొందరు రెగ్యులర్ ప్లేయర్లు లేకుండానే టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరింది. టీమిండియా కీలక ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో 5వ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి రావడంతో ఐర్లాండ్ పర్యటనలో యువ ప్లేయర్లకు అవకాశం దక్కింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20ల్లో తలపడనుంది. ఇక ఈ సిరీస్‌లో స్పిన్ ఆల్రౌండర్ దీపక్ హుడాకు అవకాశం దక్కేలా ఉంది. ఆల్రౌండర్ అయిన దీపక్ హుడా ఐర్లాండ్ పర్యటనలో ఆడాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్లో అదరగొట్టిన హుడా
దీపక్ హుడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అద్భుతంగా రాణించాడు. అతను ప్రాతినిధ్యం వహించిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ సంవత్సరం ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి అతను కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఓవర్లలో కెప్టెన్ కెఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడినప్పటికీ.. దూకుడైన బ్యాటింగ్‌తో దీపక్ హుడా జట్టుకు వెన్నుదన్నుగా నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు హుడా ఎంపికైనప్పటికీ అతనికి తుది జట్టులో మాత్రం అవకాశం రాలేదు.

చాలా పరిణతి వచ్చింది
ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐపీఎల్లో నాలుగు అర్ధ సెంచరీలు సహా 451 పరుగులతో ఆకట్టుకునేలా సీజన్‌ను ముగించాడు. ఇక ఆల్ రౌండర్ అయిన దీపక్ హుడా బంతితో కూడా రాణించగలడు. కొన్ని కీలక వికెట్లను కూడా తీసే నైపుణ్యం అతనిలో ఉంది. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో అతనికి తుది జట్టులో అవకాశం రాకపోయినప్పటికీ అతను తిరిగి ఐర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో తుది జట్టులోకి రావడానికి ఇదే సరైన టైం అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022లో బ్యాటర్ తన సత్తాను అందరికీ చూపించాడని, చాలా పరిణతితో బ్యాటింగ్ చేస్తున్నాడని, అందుకే అతన్ని జట్టులోకి తీసుకోవాలని మంజ్రేకర్ పేర్కొన్నాడు.

ఫినిషర్ల మీద ఒత్తిడి తగ్గించగలడు
సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. 'ఈ ఐర్లాండ్ సిరీస్‌లో దీపక్ హుడా తుది జట్టులో కనిపిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఐపీఎల్‌లో దీపక్ హుడా అత్యుత్తమ ప్రదర్శనను మనమందరం చూశాం. అతను చాలా కాలంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని బ్యాటింగ్, అతని సామర్థ్యం పట్ల ఓ అవగాహన వచ్చింది. గత ఐపీఎల్‌లో అతనెంతో బెటర్ బ్యాటర్‌లా కన్పించాడు. టీమిండియాకు దీపక్ హుడా లాంటి వ్యక్తి అవసరం. అతను మిడిల్ ఓవర్లలో హిట్టింగ్ చేయగలడు. తద్వారా ఫినిషర్లు అయిన హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ లాంటి వారిపై ఒత్తిడిని తగ్గించలగలడు. అయితే అతను తుది జట్టులోకి ఎంపిక కావడం కాస్త కష్టమే. కానీ అతను ఐపీఎల్లో చూపించిన సత్తాను భారతదేశం తరఫున చూపించాలనుకుంటాడు. అందువల్ల అతను ఎంపికకావాలి. నా మట్టుకు అయితే కచ్చితంగా ప్లేయింగ్ 11లో చూస్తాననే అనుకుంటున్నాను' అని మంజ్రేకర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications