దీపక్ హుడా ఉంటే ఆరు నూరైనా.. నూరు నూట యాభై అయినా గెలుపు భారత్‌దే.. హుడా పేరిట వరల్డ్ రికార్డ్

టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా కన్సిస్టెన్సీ ప్లేయర్‌గా దినదిన మెరుగువుతున్నాడు. రాబోయే రోజుల్లో ఇండియాకు వైట్-బాల్ క్రికెట్‌లో మంచి అస్సెట్ ప్లేయర్‌గా హుడా మారే అవకాశముంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్‌లో 25పరుగులతో అతను చివర్లో రాణించడంతో భారత్ సులువుగా గెలిచింది. ఇక ఈ సిరీస్లో 2-0 తేడాతో ఇప్పటికే టీమిండియా సిరీస్ కైవసం చేసుకోగా.. మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా హుడా ఓ కొత్త ఫీట్‌ను సాధించాడు.
అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఇది ప్రత్యేక రికార్డు మాత్రమే కాదు.. ప్రపంచ రికార్డు కూడా. అతను అంతర్జాతీయంగా అరంగేట్రం చేసినప్పటి నుండి.. అతను ఆడిన ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. ఇప్పటి వరకు అతను టీమిండియా తరఫున 16 మ్యాచ్‌లు ఆడగా.. ఆ 16 మ్యాచ్‌లలో ఇండియా గెలుపొందడం విశేషం. దీన్ని బట్టి దీపక్ హుడా గోల్డెన్ లెగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు.

2022 ఫిబ్రవరి నుంచే దీపక్‌కు అవకాశాలు
దీపక్ హుడా ఆడిన 16 మ్యాచుల్లో 16విజయాలను నమోదు చేయడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తర్వాత అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టులో ప్లేయర్‌గా దీపక్ హుడా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. హుడా ఇప్పటివరకు ఏడు వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడగా.. వాటన్నింటిలో భారతే గెలిచింది. 2017 నుంచి దీపక్ హుడా అనేక సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ.. ఫిబ్రవరి 2022లో మాత్రమే అతను అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

అంతకుముందు సాత్విక్ నడిబొట్ల పేరిట రికార్డు
అంతకుముందు రొమేనియాకు చెందిన సాత్విక్ నడిగొట్ల అరంగేట్రం చేశాక ఆడిన మ్యాచ్‌లలో వరుసగా 15 మ్యాచ్‌లు రొమేనియా గెలుపొందింది. తాజాగా ఆ రికార్డును దీపక్ హుడా బ్రేక్ చేశాడు. అయితే రొమేనియా క్రికెట్లో అంత తెలిసిన జట్టేం కాదు. కానీ ఇండియా లాంటి టాప్ జట్టులో దీపక్ హుడా ఈ ఘనత సాధించడం అబ్బురమనే చెప్పాలి. అలాగే దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ సైతం అరంగేట్రం చేశాక తాను ఆడిన 13వరుస మ్యాచుల్లో ప్రోటీస్ జట్టు గెలుపొందింది.

రెండో వన్డేలోనూ ఇండియా సత్తా
ఇకపోతే రెండో వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 5వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్ ప్రారంభానికి ముందు గట్టి పోటీనివ్వడం కాదు.. టీమిండియాను ఓడిస్తామని ప్రగల్భాలు పలికిన జింబాబ్వే మాటలు నీటి మూటలయ్యాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలోనే 161 పరుగులకు కుప్పకూలింది.
భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. సీన్ విలియమ్స్(42), ర్యాన్ బర్ల్(39 నాటౌట్) మినహా మిగతావాళ్లు సోయిలో కూడా లేకుండా ఆడారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 25.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి గెలుపొందింది. ధావన్ (33), శుభ్‌మన్ గిల్ (33) ఎప్పటిలాగే రాణించగా.. దీపక్ హుడా (25), సంజూ శాంసన్ (43) సత్తా చాటారు. దీంతో భారత్ ముందు చిన్న లక్ష్యం మరింత చిన్నబోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications