న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనీశ్‌ పాండే మెరుపు సెంచరీ.. దీపక్‌ చాహర్ మరో 'హ్యాట్రిక్‌'

Manish Pandey Made A Century In Syed Mushtaq Ali Trophy || Oneindia Telugu
Deepak Chahar, Manish Pandey light up in Syed Mushtaq Ali Trophy

విజయనగరం: భారత స్టార్ ఆటగాడు మనీశ్‌ పాండే (54 బంతుల్లో 129 నాటౌట్‌; 12 ఫోర్లు, 10 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగిపోవడంతో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నీలో కర్ణాటక ఘన విజయం సాధించింది. సర్వీసెస్‌తో మంగళవారం జరిగిన గ్రూప్‌-ఎ లీగ్‌ మ్యాచ్‌లో కర్ణాటక 80 పరుగుల తేడాతో నెగ్గింది. మొదటగా కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు సాధించింది.

<strong>డే/నైట్ టెస్టు.. పింక్‌ బాల్స్ వచ్చేశాయి (వీడియో)!!</strong>డే/నైట్ టెస్టు.. పింక్‌ బాల్స్ వచ్చేశాయి (వీడియో)!!

పాండే మెరుపు సెంచరీ:

పాండే మెరుపు సెంచరీ:

ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (43 బంతుల్లో 75; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)అర్ధ సెంచరీ చేసాడు. మనీశ్‌ పాండే, దేవదత్‌ రెండో వికెట్‌కు కేవలం 167 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివరలో కూడా కర్ణాటక జోరు కొనసాగించడంతో భారీ స్కోర్ చేసింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేసింది. కర్ణాటక బౌలర్‌ శ్రేయస్‌ గోపాల్‌ 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.

 దీపక్‌ చాహర్ హ్యాట్రిక్‌:

దీపక్‌ చాహర్ హ్యాట్రిక్‌:

మంగళవారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో దీపక్‌ చాహర్, మయాంక్‌ మిశ్రాలు హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. రాజస్తాన్‌ తరఫున బరిలోకి దిగిన దీపక్‌ చాహర్‌.. విదర్భతో జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ తీసాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో దర్శన్, శ్రీకాంత్, అక్షయ్‌లను అవుట్‌ చేసి హ్యాట్రిక్‌ ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో దీపక్‌ హ్యాట్రిక్‌ తీసిన విషయం తెలిసిందే.

రాజస్తాన్‌ ఓటమి:

రాజస్తాన్‌ ఓటమి:

విదర్భ, రాజస్తాన్‌ మ్యాచ్ వర్షం వల్ల 13 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 9 వికెట్లకు 99 పరుగులు చేసింది. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతిలో పద్ధతిలో రాజస్తాన్‌ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 107 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ 8 వికెట్లకు 105 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.

మయాంక్‌ మిశ్రా హ్యాట్రిక్‌:

మయాంక్‌ మిశ్రా హ్యాట్రిక్‌:

గోవాతో జరిగిన గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మిశ్రా (4/6) హ్యాట్రిక్‌ తీసాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో ఆదిత్య, అమిత్‌ వర్మ, సుయశ్‌లను పెవిలియన్ చేర్చాడు. మొదటగా గోవా 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్‌ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది.

Story first published: Wednesday, November 13, 2019, 8:34 [IST]
Other articles published on Nov 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X