Deepak Chahar Wedding: దీపక్ చాహర్ భార్య జయ అందుకే దొంగలించిందటా? ఇన్‌స్టాలో లవ్లీ క్యాప్షన్లు

టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ తన ప్రేయసి జయ భరద్వాజ్‌ను బుధవారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. వివాహనంతరం గురువారం సోషల్ మీడియాలో దీపక్ ఓ పోస్ట్ షేర్ చేశాడు. చాహర్ తన వివాహ వేడుకలోని ఓ ఫోటోను తన ఇన్ స్టాలో పోస్టు చేస్తూ.. 'నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నువ్వు నాకు సొంతమని భావించింది. నేను అనుకున్నది నిజమైంది. మనం ఇప్పటివరకు మనిద్దరం కలిసి జీవితంలోని ప్రతి క్షణాన్ని కలిసి ఆనందించాం.
ఎప్పుడూ నిన్ను సంతోషంగా ఉంచుతానని నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. ఇది నా జీవితంలోనే అత్యుత్తమ క్షణాలు' అంటూ దీపక్ పేర్కొన్నాడు. ఇక దీపక్ చాహర్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. #Deepakchahar హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్లో ఉంది.
షార్ట్ అండ్ స్వీట్‌గా జయ భరద్వాజ్ క్యాప్షన్
ఇక దీపక్ చాహర్ ప్రేయసి, సతీమణి తానేం తక్కువ తినలేదు అన్నట్లు తాను కూడా ఇన్ స్టాలో ఓ ఫోటోను పోస్టు చేస్తూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. అయితే జయ.. లెంతిగా కాకుండా షార్ట్ అండ్ స్వీట్‌గా తన ఆనందాన్ని ఆ పోస్టులో క్యాప్షన్ రూపంలో పేర్కొంది. 'చాహర్ నా హార్ట్ దొంగిలించాడు కాబట్టి నేను అతని చివరి పేరును దొంగిలించాను' అని ఆమె క్యాప్షనిచ్చింది. లెక్కకు లెక్క సరిపోయింది అన్నట్లు జయ సరదాగా పేర్కొంది. ఇక వీరిద్దరు షేర్ చేసిన ఫోటో కాస్త అటూ ఇటూగా సేమ్ ఉన్నాయి.
అన్నయ్యతో దిగిన పెళ్లి ఫోటోలు షేర్ చేసిన రాహుల్ చాహర్
ఇకపోతే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ కూడా జయ పోస్ట్‌పై స్పందిస్తూ.. నూతన వధూవరులకు అభినందనలు తెలిపింది. అలాగే ఛటేశ్వర్ పుజారా భార్య పూజా పబారి కూడా అభినందనలు తెలిపింది. దీపక్ చాహర్ పోస్ట్‌పై భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. ఇకపోతే దీపక్ తమ్ముడు రాహుల్ చాహర్ ఈ వివాహ వేడుకలో పెళ్లి బాధ్యతలు చాలా వరకు చూసుకున్నాడు. రాహుల్ చాహర్ కూడా భారతదేశం తరపున ఆడాడు. ఈ సందర్భంగా అన్నయ్యతో దిగిన పెళ్లి ఫోటోలను రాహుల్ చాహర్ షేర్ చేశాడు.

స్టేడియంలోనే దీపక్ చాహర్ ప్రపోజల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021లో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్ ముగిశాక దీపక్ చాహర్ జయ భరద్వాజ్‌కి ప్రపోజ్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టాండ్స్‌లో మోకాళ్లపై కూర్చుని జయకు ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఇక అతని ప్రపోజల్‌ను జయ అంగీకరించింది. దీపక్ చాహర్ గాయంతో ఐపీఎల్ 2022కి దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతను గాయపడడంతో పూర్తిగా ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.
రేపు రిసిప్షన్ పార్టీ
ఇకపోతే జూన్ 3న ఢిల్లీలో రిసిప్షన్ పార్టీ కూడా జరగనుంది. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లోని కమల్ మహల్‌లో రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. జయ భరద్వాజ్ స్వస్థలం కూడా ఢిల్లీ. ఈ వేడుకకు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లతో పాటు భారత జట్టులోని టాప్ ప్లేయర్లు హాజరుకానున్నారు. 60మంది క్రికెటర్లు హాజరు కానున్నారు. ఇక దీపక్ చాహర్, జయ భరద్వాజ్ వివాహ వేడుకకు 'ది రాయల్ గ్రాండియర్' అనే థీమ్ నేమ్ పెట్టారు. ఇకపోతే రిసెప్షన్‌కు భారత మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ హాజరు అయ్యే అవకాశముంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications