For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా ఎంత టైం పడుతుందంటే..?

Deepak Chahar: It Will take four to five weeks to fully recover from the Hamstring injury

తొడ కండరాల (పిక్కలు) గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి భారత పేసర్ దీపక్ చాహర్‌కు మరో నాలుగు నుంచి ఐదు వారాల టైం పట్టనుంది. దీపక్ చాహర్‌తో పాటు మరొక సెంట్రల్-కాంట్రాక్ట్ ఉన్న క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ సైతం చేతి గాయం నుంచి దాదాపుగా కోలుకున్నాడు. ఇక టి.నటరాజన్ కూడా గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. వీరు ముగ్గురు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స, ప్రాక్టీస్ పొందుతున్నారు.

ఇకపోతే చేతి గాయం దాదాపు మానడంతో స్పిన్ ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రముఖ కౌంటీ జట్టు లంకాషైర్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. 'వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. అతను లంకాషైర్ కోసం ఆడబోతున్నాడు. ఇది జట్టులె పునరాగమనం చేయడానికి మంచి ప్రాక్టీస్‌గా అతనికి పనికొస్తుంది' అని బీసీసీ అధికారి ఒకరు తెలిపారు.

ఇకపోతే కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో దీపక్ చాహర్ తొడ కండరాల గాయానికి గురైన సంగతి తెలిసిందే. ఇక NCAలో తన శిక్షణా సమయంలో మంచి ఫిట్‌గా కనిపించాడు. ఇక చాహర్ మాట్లాడుతూ.. 'నేను ప్రస్తుతం నా ఒకేసారి నాలుగు నుంచి ఐదు ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలుగుతున్నాను. నేను చాలా బాగా రికవరీ అవుతున్నాను. ఇక ఒక మ్యాచ్‌కు పూర్తి ఫిట్‌గా ఉండటానికి నాకు మరో నాలుగు నుంచి ఐదు వారాల టైం పడుతుంది.' అని చాహర్ పీటీఐ న్యూస్‌తో తెలిపాడు.

అలాగే రాజస్థాన్‌కు చెందిన దీపక్ చాహర్.. ఇంగ్లాండ్‌తో టీమిండియా ఆడబోయే టీ20 సిరీస్ టైంకు తాను ఫిట్‌గా కాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక జులై రెండో వారంలో ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. 'రికవరీకి సంబంధించినంత వరకు దశల వారీగా కోలుకోవాల్సి ఉంటుంది. నేను ఇంగ్లాండ్‌తో టీ20లకు ఫిట్‌గా ఉండే అవకాశం లేదు. ఒకసారి నేను మ్యాచ్‌కు సరిపడా ఫిట్‌ నెస్ సాధిస్తే.. నేను కొంత క్లబ్‌ క్రికెట్ ఆడాలి. నా ఫిట్‌నెస్‌ని చెక్ చేసుకునే మ్యాచ్‌లు కొన్ని ఆడాలి' అని చాహర్ చెప్పాడు.

ఇకపోతే ఎన్సీఏలో చాలా టైం బ్యాటింగ్ చేసినప్పుడు అతను చాలా ఫిట్‌గా కనిపించాడు. ఇకపోతే వెస్టిండీస్‌తో టీ20పర్యటనకు అయినా సెట్ అవుతారా అని వ్యాఖ్యత అతన్ని ప్రశ్నించగా.. 'అది ఇప్పుడే చెప్పలేను కానీ అప్పటికి తప్పకుండా ట్రై చేసి ఫిట్‌గా ఉంటాను. చూద్దాం' అని దీపక్ అన్నాడు. వెస్టిండీస్‌తో జులై 22 నుంచి ఆగస్టు 7వరకు భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాల్సి ఉంది.

Story first published: Tuesday, June 21, 2022, 18:22 [IST]
Other articles published on Jun 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+