For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు.. మూడో బౌలర్‌గా చహర్‌ అరుదైన రికార్డు!!

Ind vs Ban 2019,3rd T20I : Deepak Chahar Becomes First Indian Cricketer To Claim T20I Hat-Trick
Deepak Chahar is the third bowler to take 6 wickets in a single innings in T20IS

నాగ్‌పుర్‌: నాగ్‌పుర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాట్‌తో శ్రేయస్‌ అయ్యర్ (62; 33 బంతుల్లో 3×4, 5×6), కేఎల్‌ రాహుల్‌ (52; 35 బంతుల్లో 7×4) మెరవగా.. తర్వాత బంతితో మీడియం పేసర్ దీపక్ చహర్ (6/7) హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లు తీయడంతో భారత్ 30 పరుగుల తేడాతో బంగ్లాను మట్టికరిపించింది. సంచలన బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన చహర్‌కే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', 'సిరీస్‌' అవార్డులు దక్కాయి.

మూడో టీ20లో దీపక్ చహర్ (3.2-7-6) అద్భుత బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చహర్‌ రికార్డులోకి ఎక్కాడు. శ్రీలంక స్పిన్నర్‌ అజంతా మెండిస్‌, భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌ మాత్రమే టీ20ల్లో ఆరు వికెట్లు తీశారు. మెండిస్‌, చహల్‌ స్పిన్నర్లు కాగా.. చహర్ పేస్ బౌలర్‌ కావడం విశేషం. మెండిస్‌ ఒకసారి కాదు రెండు సార్లు ఆరు వికెట్లు తీసాడు. 2011లో ఆ్రస్టేలియాపై 6/16, 2012లో జింబాబ్వేపై 6/8 ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2017లో ఇంగ్లండ్‌పై 6/25 చహల్‌ ఆరు వికెట్లు తీసాడు.

అంతర్జాతీయ టీ20ల్లో చహర్ 3.2-7-6 అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. ఇంతకుముందు వరకు మెండిస్‌ 6/8 రికార్డు ఉంది. మూడో టీ20లో చహర్ హ్యాట్రిక్‌ కూడా తీసాడు. 18వ ఓవర్‌ చివరి బంతికి షఫీయుల్‌ వికెట్‌ను.. ఆ తర్వాత 20వ ఓవర్‌ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను ఔట్ చేసి 'హ్యాట్రిక్‌' సాధించాడు.

భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 'హ్యాట్రిక్‌' తీసిన తొలి బౌలర్‌గా కూడా దీపక్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే మొత్తంగా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్‌. మలింగ (శ్రీలంక) రెండుసార్లు 'హ్యాట్రిక్‌' తీయగా.. బ్రెట్‌ లీ (ఆస్ట్రేలియా), ఓరమ్, సౌతీ (న్యూజిలాండ్‌), తిసారా పెరీరా (శ్రీలంక), అష్రఫ్‌ (పాకిస్తాన్‌), రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్తాన్‌), హస్నయిన్‌ (పాకిస్తాన్‌), ఖవర్‌ అలీ (ఒమన్‌), వనువా (పపువా న్యూగినియా) తలొసారి హ్యాట్రిక్‌ తీశారు.

మూడు ఫార్మాట్‌లలో కలిపి భారత్‌ తరఫున చేతన్ శర్మ, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్‌, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ హ్యాట్రిక్‌ తీశారు.

Story first published: Monday, November 11, 2019, 12:51 [IST]
Other articles published on Nov 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+