For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రేయసిని పెళ్లాడనున్న దీపక్ చాహర్.. ముహూర్తం కూడా ఫిక్సయింది

Deepak Chahar is getting married to his girlfriend Jaya Bhardwaj on June 1

టీమిండియా మరియు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతను తన చిరకాల స్నేహితురాలు అయిన జయ భరద్వాజ్‌ని జూన్ 1న పెళ్లి చేసుకోబోతున్నాడు. గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్‌లో దీపక్ చాహర్ జయకు అందరిముందు ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. జయ భరద్వాజ్ ఢిల్లీకి చెందిన అమ్మాయి. ఆమె ఢిల్లీలోని ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది. ఇక దీపక్-జయ వివాహాన్ని దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ కన్ఫామ్ చేశాడు.

ఇక ఆయన మాట్లాడుతూ.. దీపక్ కొంతకాలంగా తన స్నేహితురాలికి ప్రపోజ్ చేయాలని భావించాడు. అందుకు ఐపీఎల్ 2021 ప్లేఆఫ్స్ దశలో అలా చేయాలని చూశాడు. కానీ సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ సలహా మేరకు అతను పంజాబ్ కింగ్స్‌తో జరిగిన సీఎస్కే చివరి లీగ్ మ్యాచ్‌లోనే దీపక్ చాహర్.. జయకు ప్రపోజ్ చేశాడని పేర్కొన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా వేలం సందర్భంగా చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14కోట్ల భారీ ధరకు తిరిగి సొంతం చేసుకుంది. అతను సీఎస్కే ఫ్రాంచైజీలో కీలక ఆటగాడిగా మారాడు. వెన్నులో గాయం కారణంగా అతను బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చికిత్స, శిక్షణ తీసుకుంటున్నాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో పూర్తి మ్యాచ్‌లకు దీపక్ చాహర్ దూరమయ్యాడు. జయ భరద్వాజ్‌తో దీపక్ చాహర్ పెళ్లి ఫిక్సయిన విషయం, పెళ్లి కార్డు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

వెన్ను గాయం తగ్గిన తర్వాత మరో రెండు నెలలపాటు దీపక్ చాహర్ ఆటకు దూరం కానున్నాడు. అయినప్పటికీ తాను మరింత బలంగా తిరిగి గ్రౌండ్లోకి అడుగుపెడతానని దీపక్ చాహర్ గతంలో చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్‌లో జరగాల్సి ఉన్నందున.. చాహర్ త్వరగా కోలుకుని జాతీయ జట్టు కోసం ఆడటానికి అన్ని ఫిట్‌నెస్ పరీక్షలను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

Story first published: Saturday, May 21, 2022, 19:11 [IST]
Other articles published on May 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+