సోదరికి బౌలింగ్ చేసిన దీపక్ చహర్.. చివరలో ఊహించని ట్విస్ట్ (వీడియో)!!

చెన్నై: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ఆటగాళ్లు అందరూ దాదాపు మూడు నెలలుగా కుటుంబంతో గడిపారు. తాజాగా లాక్‌డౌన్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సడలించడంతో.. దగ్గరలో ఉన్న మైదానాల్లోకి కొందరు భారత క్రికెటర్లు అడుగుపెట్టారు. వారందరూ ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చహర్ కూడా మైదానంలోకి దిగాడు.

సోదరికి బౌలింగ్ చేసిన దీపక్ చహర్:
తాజాగా దీపక్ చహర్ తన సోదరి మాలతి చహర్‌తో కలిసి ప్రాక్టీస్‌ని ప్రారంభించాడు. మాలతి బ్యాటింగ్ చేస్తుండగా.. ఆమెకి దీపక్ బౌలింగ్ చేసాడు. బౌలింగ్ చేస్తున్న చహర్.. చివరలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. రెగ్యులర్ రన్నప్‌తో వచ్చిన చహర్.. ఒక్కసారిగా అండర్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు. అలా వేసిన బంతిని మాలతి స్లిప్ దిశగా షాట్ ఆడారు. ఈ వీడియోకి ఐపీఎల్ కామెంట్రీని జతచేసిన మాలతి.. మరీ అభిమానులతో పంచుకున్నారు. ఇక్కడ అంపైర్ కూడా ఉండడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

వెన్ను గాయంతో దూరం:
గత ఏడాది డిసెంబర్‌లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్‌లో దీపక్ చహర్ గాయడ్డాడు. దీంతో అప్పటినుండి జట్టుకు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం తీసుకున్నాడు. అక్కడ ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. కరోనా కారణంగా మూడు నెలలు బ్రేక్ రావడంతో ఇప్పుడు అతను వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచ్‌లాడిన చహర్.. 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఇదే అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్.

10 టీ20లు.. 17 వికెట్లు:
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పర్యవేక్షణలో చెన్నైకి ఆడుతూ రాటుదేలిన దీపక్ చహర్.. అద్భుత బౌలింగ్‌తో బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో భారత జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాన్ని అందుకున్నాడు. కొత్త బంతితో.. డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణిస్తూ ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. మొత్తం 10 అంతర్జాతీయ టీ20లు ఆడిన దీపక్.. 7 ఎకనామితో 17 వికెట్లు పడగొట్టాడు. ఇక మూడు వన్డేలలో రెండు వికెట్లు పడగొట్టాడు.
టీ20లో హ్యాట్రిక్:
గతేడాది నాగ్‌పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చహర్ (6/7) హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు తీసాడు. చహర్ (3.2-7-6) అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేసాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చహర్ రికార్డులోకి ఎక్కాడు. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్, భారత స్పిన్నర్ యుజువేంద్ర చహల్ మాత్రమే టీ20ల్లో ఆరు వికెట్లు తీశారు. మెండిస్, చహల్ స్పిన్నర్లు కాగా.. చహర్ పేస్ బౌలర్ కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications