
టీమిండియా పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ దీపక్ చాహర్ బుధవారం తన ప్రేయసి జయ భరద్వాజ్‌ను పెళ్లాడనున్నాడు. ఇక వివాహానికి ముందు జరిగిన మెహందీ వేడుకలో దీపక్ చాహర్, జయభరద్వాజ్ డ్యాన్స్ చేశారు. అలాగే ఇరువురు కుటుంబసభ్యులు సైతం స్థానిక బ్యాండ్‌కు అనుగుణంగా నృత్యం చేశారు. ఆగ్రాలో వీరి వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం సంగీత్ పార్టీలో దీపక్ చాహర్, జయ భరద్వాజ్ తమ డ్యాన్స్‌తో అలరించారు. సంగీత్ పార్టీ కోసం గత కొన్ని రోజులుగా వీరిద్దరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
ఇకపోతే నేడు రాత్రి 9గంటలకు వీరి వివాహం జరగనుంది. ఆగ్రాలోని జేపీ ప్యాలెస్ హోటల్ వీరి వివాహానికి వేదిక కానుంది. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఇక మెహందీ ఫంక్షన్ సాయంత్రం 6గంటలకు జరుగనుంది. ఉదయం 10గంటలకు హల్దీ వేడుక ఘనంగా జరిగింది. రాత్రి 9గంటలకు వివాహ బంధంతో ఈ జంట ఒక్కటి కానుంది. ఇకపోతే జూన్ 3న ఢిల్లీలో రిసిప్షన్ పార్టీ కూడా జరగనుంది. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లోని కమల్ మహల్‌లో రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు.
జయ భరద్వాజ్ స్వస్థలం కూడా ఢిల్లీ. ఈ వేడుకకు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లతో పాటు భారత జట్టులోని టాప్ ప్లేయర్లు హాజరుకానున్నారు. 60మంది క్రికెటర్లు హాజరు కానున్నారు. ఇక దీపక్ చాహర్, జయ భరద్వాజ్ వివాహ వేడుకకు 'ది రాయల్ గ్రాండియర్' అనే థీమ్ నేమ్ పెట్టారు. ఇకపోతే రిసెప్షన్‌కు భారత మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ హాజరు అయ్యే అవకాశముంది. అయితే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరుకావడం డౌటే. గత వారం మాల్దీవులకు వెళ్లిన రోహిత్ శర్మ ఈ వేడుకకు హాజరు కాకపోవచ్చు.
ఆగ్రా చాట్ నుండి ఇటాలియన్ వంటకాల వరకు విందులో అన్నిరకాల ఐటమ్స్ వడ్డించనున్నారు. ఇక దీపక్ చాహర్ గాయం వల్ల ఈ ఐపీఎల్ సీజన్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడలేదు. ఇక సీఎస్కే ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీపక్ చాహర్ లేకపోవడం వల్ల సీఎస్కే బౌలింగ్ యూనిట్లో కాస్త పదును తగ్గింది.