Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవీంద్ర జడేజాకు అర్జున... దీపా మాలిక్‌‌కు ఖేల్ రత్న

Jadeja

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు ప్రతిష్టాత్మక అర్డున అవార్డు లభించింది. ఫలితంగా అర్జున అవార్డు తీసుకున్న 54వ ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డు సొంతం చేసుకున్నారు. భారత్‌ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42టీ20లు ఆడాడు.

ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో జడేజా అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జాతీయ పురస్కారాల కోసం మొత్తం 12 మంది స‌భ్యులతో ఓ ప్యానెల్‌ కేంద్ర క్రీడాశాఖ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. క్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ తాజాగా ఆమోదం తెలిపింది.

ఈ ప్యానెల్ రెండు రోజుల చ‌ర్చ‌ల అనంత‌రం భజరంగ్ పూనియాకు ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. భ‌జ‌రంగ్ పూనియాకు ఖేల్ ర‌త్న ఇవ్వ‌నున్నామ‌ని, ఏక‌ప‌క్షంగా ఆ అవార్డుకు అత‌ని పేరును ఎంపిక చేసింది. తాజాగా, పారా అథ్లెట్ దీపా మాలిక్‌కు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం దక్కింది. రియో పారాలింపిక్స్‌లో షాట్‌ పుట్‌లో భారత్‌ తరఫున దీపా మాలిక్‌ వెండి పతాకాన్ని సాధించారు.

అంతేకాదు ఆమె 2017లో పద్మశ్రీ, 2012లో అర్జున అవార్డును అందుకున్నారు. కాగా, జడేజా కంటే ముందు సునీల్ గవాస్కర్, చందు బోరే. కపిల్ దేవ్, మొయిందర్ అమర్‌నాథ్, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, రోహిత్ శర్మ, మిథాలీ రాజ్, స్మృతి మందాన్న తదితరులు ఈ అవార్డు దక్కించుకున్నారు.

ప్రతి ఏటా భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా పురస్కారాలను ప్రధానం చేస్తోన్న సంగతి తెలిసిందే. మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. ఈ ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు అవార్డులను అందజేయనున్నారు.

Story first published: Saturday, August 17, 2019, 21:00 [IST]
Other articles published on Aug 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+