For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కేఎల్ రాహుల్‌ క్వాలిటీ బ్యాట్స్‌మన్‌.. మూడు ఫార్మాట్లలోనూ అవకాశాలివ్వండి'

Deep Dasgupta says KL Rahul too good a player to not be playing all 3 formats

ముంబై: టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌ క్వాలిటీ బ్యాట్స్‌మన్‌ అని భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్త అన్నాడు. కేఎల్ రాహుల్‌కి అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశాలివ్వాలని దీప్ దాస్‌గుప్త సూచించారు. టీ20 జట్టులో రాహుల్‌కి రెగ్యులర్‌గా ఛాన్స్‌లివ్వాలి, ఏడాది వ్యవధిలోనే రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో టీమిండియా ప్రణాళికల్లో అతడు ముఖ్యమైన ఆటగాడు అని పేర్కొన్నాడు.

రాహుల్‌కి ఛాన్స్‌లివ్వండి:

రాహుల్‌కి ఛాన్స్‌లివ్వండి:

తాజాగా దీప్ దాస్‌గుప్త ఇండియాటుడే.ఇన్‌తో మాట్లాడుతూ... 'కేఎల్ రాహుల్‌‌కి మూడు ఫార్మాట్లలోనూ అవకాశాలివ్వాలి. అతను నాణ్యమైన బ్యాట్స్‌మెన్, మంచి వికెట్ కీపర్ కూడా. రాహుల్‌‌కి టీ20 జట్టులో రెగ్యులర్‌గా ఛాన్స్‌లివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నా. ఏడాది వ్యవధిలోనే రెండు టీ20 ప్రపంచకప్‌లు జరగనున్న నేపథ్యంలో రాహుల్ టీ20 జట్టులో ఉండటం కీలకం. అన్ని ఫార్మాట్‌లలో రాహుల్ బాగా ఆడగలడు. వన్డేల్లో నెం.5లో నిలకడగా రాణిస్తున్నాడు. అయితే కీపింగ్ చేయించాలా? వద్దా? అనేది మేనేజ్‌మెంట్ నిర్ణయం. రాహుల్ టెస్ట్ క్రికెట్ కూడా ఆడాలి. కీపింగ్ మాత్రం ఇవ్వొద్దు' అని అన్నాడు.

ఏ ప్రాతిపదికన మహీని ఎంపిక చేస్తారు:

ఏ ప్రాతిపదికన మహీని ఎంపిక చేస్తారు:

'టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 9 నెలలకు పైగా పోటీ క్రికెట్ ఆడలేదు. అతను చివరగా గతేడాది వన్డే ప్రపంచకప్ ఆడాడు. మహీ అప్పటి నుండి క్రికెట్ ఆడలేదు. గత 9 నెలల్లో అతను ఆడటం ఎవరూ చూడలేదు. ఐపీఎల్-13 కోసం ఇటీవలే చెన్నైలో ప్రాక్టీస్ చేసాడు. అది కొద్ది రోజులు మాత్రమే. ఖాళీ సమయంలో దేశీయ క్రికెట్ రంజీ ట్రోఫీ ఆడి ఉంటే.. నేను అర్థం చేసుకోగలను. రంజీ ట్రోఫీ ఆడితే బాగుండు. 9 నెలల ఆడని ధోనీని తీసుకుంటే.. వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లను కూడా జట్టులోకి తీసుకోవచ్చు. ఏ ప్రాతిపదికన మహీని టీ20 ప్రపంచకప్‌ ఎంపిక చేస్తారు' అని దీప్ దాస్‌గుప్త ప్రశ్నించాడు.

 ప్రపంచకప్ తర్వాత జట్టుకి దూరం:

ప్రపంచకప్ తర్వాత జట్టుకి దూరం:

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉందాం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. కేఎల్ రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌ జట్టులోనూ రాహుల్‌కి అవకాశమివ్వాలని గుప్త సూచించాడు.

కీపర్ రేసులో రాహుల్, పంత్:

కీపర్ రేసులో రాహుల్, పంత్:

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌ జరగనుండగా.. కీపర్ రేసులో రాహుల్, పంత్ ముందు వరుసలో ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్ జరిగి.. ధోనీ ఫామ్ నిరూపించుకోగలిగితే ధోనీ కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ.. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదా పడింది. ఇప్పటికీ వైరస్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీ జరగడంపై సందిగ్ధత నెలకొంది.

Story first published: Tuesday, April 14, 2020, 10:57 [IST]
Other articles published on Apr 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+