IPL 2021:వార్నర్ లేకపోవడం విస్మయం కలిగించింది.. ఇదేం నిర్ణయం! 23 మందిలో 21 మందిని ఇప్పటికే ప్రయత్నించారు!

IPL 2021: Kane Williamson On David Warner’s Return To The XI | Oneindia Telugu

ముంబై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో బ్యాట్స్‌మన్‌గానూ డేవిడ్‌ వార్నర్‌కు చోటు దక్కకపోవడం తనకు విస్మయం కలిగించిందని భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత దీప్‌దాస్‌ గుప్తా అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకడైన కేన్‌ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్‌ నాయకత్వం అప్పగించడంలో అర్థముందని, అయితే ఆటగాడిగానూ వార్నర్‌ను తీసుకోకపోవడం అర్థరహితంగా అనిపించిందన్నారు.

ఈ సీజన్లో ఓటములతో విసిగిపోయిన సన్‌రైజర్స్‌ మేనేజ్మెంట్ కెప్టెన్‌ వార్నర్‌పై వేటు వేసింది. కివీస్‌ సారథి విలియమ్సన్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పింది. కెప్టెన్ మారినా సన్‌రైజర్స్‌ తలరాత మాత్రం మారలేదు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌పై ఓడిపోయింది.

 విస్మయం కలిగించింది

విస్మయం కలిగించింది

కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ఆటగాడిగానూ డేవిడ్‌ వార్నర్‌పై సన్‌రైజర్స్‌ మేనేజ్మెంట్ వేటు వేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో వార్నర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దీప్‌దాస్‌ గుప్తా మాట్లాడుతూ.. 'టోర్నీకి ముందు సన్‌రైజర్స్‌ నా టాప్-4 జట్లలో ఒకటి. కానీ అంచనాలు అందుకోవడం లేదు.

భువీ, నటరాజన్‌ గాయపడ్డారు. వార్నర్‌ గొప్ప ఫామ్‌లో లేడు. కానీ సన్‌రైజర్స్‌ నిర్ణయాలు కొన్ని అర్థరహితంగా ఉంటున్నాయి. తుది జట్టులో వార్నర్ లేకపోవడం నాకు విస్మయం కలిగించింది. గొప్ప నాయకుడు కాబట్టి సారథ్యాన్ని విలియమ్సన్‌కు బదిలీ చేశారు. కనీసం ఆటగాడిగా వార్నర్‌ లేకపోవడం ఆశ్చర్యమే' అని అన్నాడు.

21 మందిని ప్రయత్నించారు

21 మందిని ప్రయత్నించారు

'వార్నర్‌కు చోటివ్వకపోవడం దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే చాలా అన్యాయం. అతడి స్థానంలో ఆడిన వారిని ఒక్క మ్యాచుతోనే నిర్ణయించకూడదు. తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. ఏదేమైనప్పటికీ హైదరాబాద్‌ జట్టులో స్థిరత్వం కనిపించడం లేదు. వాళ్లు చాలా మందిని ఆడించారు. వివిధ కూర్పులను ప్రయత్నించారు. ఏవీ పనిచేస్తున్నట్టు అనిపించడం లేదు. 23 మందిలో 21 మందిని ఇప్పటికే ప్రయత్నించారంటేనే డ్రస్సింగ్‌ రూమ్‌ వాతావరణం గురించి అర్థం చేసుకోవచ్చు' అని దీప్‌దాస్‌ గుప్తా పేర్కొన్నారు.

IPL 2021: చెన్నై జట్టులోనూ కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్! ఐపీఎల్‌ను వాయిదా వేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి!

మళ్లీ ఆడకపోవచ్చు

మళ్లీ ఆడకపోవచ్చు

డేవిడ్ వార్నర్ తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అడే అవకాశం లేదని ఆ జట్టు కోచ్ ట్రెవర్ బెయిలీస్ అన్నాడు. విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండే నిబంధనతో తాము బౌలింగ్​ ఆప్షన్లను కూడా దృష్టిలో పెట్టుకునే వార్నర్​ను పక్కన పెట్టినట్లు ట్రెవర్ వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం తప్పలేదన్నాడు.

తాము ఆడబోయే మిగతా మ్యాచ్​ల్లోనూ దాదాపుగా ఇదే వ్యూహాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో వార్నర్ షాక్‌కు గురయ్యాడని టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ అన్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నాడు. ఇది అందరం కలిసి సమష్టిగా తీసుకున్న కఠిన నిర్ణయమని, ఇందులో ఏ ఒక్కరి పాత్ర లేదని స్పష్టం చేశాడు.

ఇంత చేసినా

ఇంత చేసినా

డేవిడ్ వార్నర్‌ 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇక 2016లో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు అదే ఏకైక టైటిల్‌. ఆ తర్వాతి ఏడాది ప్లేఆఫ్స్‌ చేర్చాడు. బాల్‌ టాంపరింగ్‌ నిషేధం కారణంగా 2018 సీజన్‌కు దూరమయ్యాడు.

2019లో ఆటగాడిగానే కొనసాగినా.. తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుని మరోసారి సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్స్‌ తీసుకెళ్లాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు (5447) చేసిన విదేశీ ఆటగాళ్లలో అగ్రస్థానం వార్నర్‌దే. మెగా టోర్నీలో 50 అర్ధ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ అతడే. 2014 నుంచి ఆడిన ప్రతి సీజన్‌లోనూ కనీసం 500 పరుగులు చేస్తున్నాడు. అత్యధిక సార్లు ఆరెంజ్‌ క్యాప్‌ (2015, 2017, 2019) అందుకున్న ఆటగాడూ కూడా.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 3, 2021, 17:25 [IST]
Other articles published on May 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X