'నాకు నమ్మకం ఉంది.. టీమిండియా కెప్టెన్‌గా ధావన్, భువనేశ్వర్ సరైన్నోళ్లు'

IND VS SL : లంక పర్యటనకు కెప్టెన్‌ ఎవరు? Dhawan, Bhuvneshwar అంటున్న మాజీలు || Oneindia Telugu

ముంబై: జూలైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. టీమిండియా కెప్టెన్‌గా సరైన వ్యక్తి అని భారత మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌ దీప్ దాస్‌గుప్తా అన్నారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ కూడా కెప్టెన్సీకి బలమైన పోటీదారుడని తాను విశ్వసిస్తున్నానన్నారు.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. మరోవైపు గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ప్లాన్ చేసింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

లంక పర్యటనకు కెప్టెన్‌ ఎవరు?

లంక పర్యటనకు కెప్టెన్‌ ఎవరు?

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుండడంతో.. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ప్రధాన టీంతోనే వెళ్లనున్నారు. దాంతో శ్రీలంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం, ఎన్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. లంక టూర్‌కి కోచ్‌గా వ్యవహరించమని బీసీసీఐ ద్రవిడ్‌ని కోరినట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌తో పాటు ఎన్‌సీఏలోని సపోర్ట్ స్టాఫ్‌ కూడా లంకకి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే లంక పర్యటనకు కెప్టెన్‌ ఎవరనేది మాత్రం తెలియదు. కెప్టెన్‌ రేసులో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీప్ దాస్‌గుప్తా స్పందించారు.

కెప్టెన్‌లుగా ధావన్, భువీ

కెప్టెన్‌లుగా ధావన్, భువీ

తాజాగా స్పోర్ట్స్ టుడేతో దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ... 'లంక పర్యటనకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండరు. సీనియర్-మోస్ట్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఒక్కడే జట్టులో ఉంటాడు. ధావన్‌కే కెప్టెన్సీ ఇస్తారని నేను ఊహిస్తున్నా. భువనేశ్వర్ కుమార్‌ను మర్చిపోవద్దు. భువనేశ్వర్ ఫిట్‌గా ఉండి ఆడటానికి సిద్ధంగా ఉంటే.. అతను కూడా మంచి కెప్టెన్ అభ్యర్థి. ఇద్దరిపై నాకు నమ్మకం ఉంది. జట్టును ముందుండి నడిపించగలరు' అని అన్నారు. ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథ్యం వహించిన అయ్యర్‌కు జట్టు పగ్గాలు దక్కే అవకాశం కూడా ఉంది. అయితే అతడు గాయం నుంచి కోలుకోవాల్సి ఉంది.

ఆకాశ్ చోప్రా ఐపీఎల్ జట్టు.. ధోనీ, రోహిత్‌, కోహ్లీలకు దక్కని చోటు! బుమ్రాకు షాకే!

భువీ లేకపోవడం ఆశ్చర్యపరచలేదు

భువీ లేకపోవడం ఆశ్చర్యపరచలేదు

'ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన 20 మంది టెస్ట్ జట్టులో భువనేశ్వర్ కుమార్ పేరు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే ఇప్పటికే జట్టులో 6 ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే భువీ బౌలింగ్ ఇంగ్లండ్ పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. కానీ అతడు 2-2.5 సంవత్సరాలు రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. భువీ 2018 నుంచి ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

టెస్ట్ క్రికెట్‌కు అతడి శరీరం సహకరిస్తుందో లేదో చెప్పలేం. టెస్ట్ క్రికెట్‌లో 20-30 ఓవర్లు బౌలింగ్ చేయవలసి ఉంటుంది, మరుసటి రోజు మరలా బౌలింగ్ చేయాలి. అతను రంజీ ట్రోఫీలో కూడా రెడ్-బాల్ క్రికెట్ ఆడలేదు. ఏదేమైనా భువీ మంచి వైట్ బాల్ క్రికెటర్. లంక పర్యటనకు అందుబాటులో ఉండడం టీమిండియాకు కలిసొచ్చేదే' అని దీప్ దాస్‌గుప్తా పేర్కొన్నారు.

జులై 5న ముంబై నుంచి లంకకి

జులై 5న ముంబై నుంచి లంకకి

బోర్డుల సమాచారం ప్రకారం భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి.. 28న తిరుగు పయనంకానుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లూ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.

2018లో ఆఖరిగా శ్రీలంకలో భారత్ మ్యాచ్‌లు ఆడింది. భారత టెస్టు జట్టు జూన్ 2న ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లబోతుండగా.. సెకండ్ టీమ్ జులై 5న ముంబై నుంచి లంకకి బయల్దేరనుంది. శ్రీలంకకి వెళ్లిన తర్వాత టీమిండియా కనీసం వారం రోజులు క్వారంటైన్‌లో ఉండనుంది. ఈ వారంలో మూడు రోజులు ఆటగాళ్లు గదులకే పరిమితంకానుండగా.. మిగిలిన నాలుగు రోజులు హోటల్ పరిధిలోనే ప్రాక్టీస్, జిమ్‌ని వినియోగించుకునే వెసులబాటుని కల్పించనున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 11, 2021, 16:03 [IST]
Other articles published on May 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X