విహారి వద్దు... ఓపెనర్‌గా రోహిత్ శర్మ ముద్దు: మాజీ వికెట్ కీపర్

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా బుధవారం నుంచి జరగనున్న ఆసీస్‌తో జరగనున్న మూడో టెస్టులో ఓపెనర్‌గా రోహిత్ శర్మకు అవకాశమివ్వాలని మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్‌గుప్త సూచించాడు. బాక్సింగ్ డే టెస్టుకు మంగళవారం జట్టు మేనేజ్‌మెంట్ తుది జట్టును ప్రకటించింది. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

రెండో టెస్టులో 146 పరుగులతో భారత్ ఓటమి
స్పెషలిస్టు స్పిన్నర్‌ను తీసుకోకుండా నలుగురు ఫాస్ట్‌బౌలర్లతో బరిలోకి దిగిన టీమిండియా 146 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండో టెస్టులో నలుగురు పేసర్లతోనే టీమిండియా బరిలోకి దిగడంతో అటు క్రికెట్ విశ్లేషకులు, ఇటు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఈ సిరిస్‌లో వరుసగా విఫలమైన ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌లను జట్టు నుంచి తొలగించింది.

ఓపెనర్లుగా మయాంక్, హనుమ విహారి
వారి స్థానంలో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఓపెనర్లుగా ఆడనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హనుమ విహారి స్థానంలో రోహిత్ శర్మకి అవకాశమిస్తే మంచిదని దేశ్‌గుప్త చెప్పుకొచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సుదీర్ఘకాలంగా ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు.

మయాంక్ అగర్వాల్‌కి తోడుగా
తాజాగా మెల్‌బోర్న్ టెస్టులో మయాంక్ అగర్వాల్‌కి తోడుగా ప్రొఫెషనల్ ఓపెనర్ జట్టులో లేకపోవడంతో రోహిత్ శర్మకి ఒక్క అవకాశం ఇవ్వాలనే క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కాగా, మెల్‌బోర్న్ పిచ్ బ్యాటింగ్‌కి ఎక్కువగా అనుకూలిస్తుందనే వార్తలు వస్తోన్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఆడితే భారత్‌కి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని దేశ్‌గుప్త పేర్కొన్నారు.

ఓపెనర్‌గా హనుమ విహారిని ఆడిస్తామన్న చీఫ్ సెలక్టర్
అయితే, బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా హనుమ విహారిని ఆడిస్తామని.. ఒకవేళ అతను విఫలమైతే మళ్లీ మిడిలార్డర్‌లో అవకాశాలిస్తామని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడం కొసమెరుపు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్ ఏదైనా అనూహ్యం నిర్ణయం తీసుకుంటే తప్ప రోహిత్ శర్మను ఓపెనర్‌గా చూడలేం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications