IND vs ENG 2021: పృథ్వీ షా, సూర్యకుమార్ టెస్ట్ జట్టులో చేరికపై ఎక్కడో డౌటానుమానం: తేల్చుడే

ముంబై: భారత్ క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం పుట్టించింది. పలువురు యంగ్ క్రికెటర్ల కేరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రత్యేకించి- టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ పృథ్వీ షా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ టెస్ట్ కేరీర్ ప్రస్తుతం డోలాయమానంలో పడింది. కరోనా వైరస్ బారిన పడ్డ స్పిన్నర్ కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగినందున తోటి క్రికెటర్లతో పాటు ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం ఐసొలేషన్‌లో కాలం వెల్లదీస్తోన్నారు. మరో నాలుగు రోజుల్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కావాల్సిన ఈ దశలో వారు శ్రీలంకలో ఐసొలేషన్‌లో ఉంటోన్నారు.

ఇంగ్లాండ్‌కు బదులు ఐసొలేషన్‌లో..

ఇంగ్లాండ్‌కు బదులు ఐసొలేషన్‌లో..

పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు హార్దిక పాండ్యా, యజువేందర్ చాహల్, కృష్ణప్ప గౌతమ్, ఇషాన్ కిషన్, మనీష్ పాండే ఐసొలేషన్‌లో ఉంటోన్నారు. వారిలో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రమోట్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న టెస్ట్ జట్టులో చోటు కల్పించింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్.. ఇంగ్లాండ్‌ విమానం ఎక్కేసి ఉండేవారే. శ్రీలంకతో సిరీస్ ముగిసిన వెంటనే వారు లండన్ వెళ్లాల్సి ఉంది. అనూహ్యంగా వారు లంకలోనే ఐసొలేషన్‌లో గడపాల్సి వచ్చింది.

నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే..

నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే..

ఐసొలేషన్‌లో ఉన్న క్రికెటర్లందరికీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోన్నారు. పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌ వరుసగా మూడుసార్లు కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పిస్తే గానీ టెస్ట్ జట్టులో చేరడానికి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశాన్ని ఇవ్వబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇప్పటిదాకా వారికి నిర్వహించిన రెండు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయని పేర్కొంది. మరో నెగెటివ్ సర్టిఫికెట్ అందాల్సి ఉందని తెలిపింది. ఈ ఉదయం వారికి చివరి నిర్ధారణ పరీక్షను నిర్వహించారు. ఇంకొన్ని గంటల్లో ఈ రిపోర్ట్ అందాల్సి ఉంది. అది కూడా నెగెటివ్ వస్తే.. ఆ ఇద్దరూ ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్తారని వివరించింది.

అప్పటిదాకా నో కామెంట్..

అప్పటిదాకా నో కామెంట్..

పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు టెస్ట్ జట్టులో చేరికపై ఇప్పటికిప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు జాతీయ వార్త సంస్థకు తెలిపారు. వారికి నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తరువాతే నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఉదయం వారికి మూడోదఫా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించామని, మధ్యాహ్నానికి దానికి సంబంధించిన నివేదిక అందుతుందని చెప్పారు. ఆ తరువాతే తమ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

T20 World Cup 2021 India’s Playing XI Announced By Virender Sehwag & Ashish Nehra | Oneindia Telugu
 4న తొలి టెస్ట్..

4న తొలి టెస్ట్..

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆగస్టు 4వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని సీనియర్ల జట్లు ఇంగ్లాండ్‌ను ఢీ కొట్టనుంది. తొలి టెస్ట్‌కు ట్రెంట్‌బ్రిడ్జ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 14వ తేదీన చివరి టెస్ట్ మ్యాచ్ ముగుస్తుంది. మరోవంక ఇంగ్లాండ్ కూడా బెన్‌స్టోక్స్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవట్లేదు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటోన్నట్లు బెన్‌స్టోక్స్ ప్రకటించాడు. భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కాబోతోన్న ఈ పరిస్థితుల్లో బెన్‌స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ క్రికెట్ జట్టులో బాంబును పేల్చినట్టయింది.

గాయాలతో ప్లేయర్లు..

గాయాలతో ప్లేయర్లు..

ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డ విషయం తెలిసిందే. సిరీస్ మొత్తానికీ అతను అందుబాటులో ఉండట్లేదు. అదే సమయంలో స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ సైతం గాయలబారిన పడ్డాడు. సెలెక్ట్ కౌంట్ ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడుతూ వేలిని గాయపరచుకున్నాడు. ఫలితంగా అతణ్ని ఆరువారాల పాటు విశ్రాంతి కల్పించాలని ఫిజియోథెరపిస్ట్ సూచించారు. దీనితో అతను స్వదేశానికి తిరుగుముఖం పట్టనున్నాడు. వారిద్దరితో పాటు యంగ్ బౌలర్ అవేష్ ఖాన్ పరిస్థితీ దీనికి భిన్నంగా ఏమీ లేదు. అతను గాయాల దెబ్బను రుచి చూసిన వాడే. అజింక్య రహానే కూడా కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు.

 ఏరి కోరి షా, యాదవ్..

ఏరి కోరి షా, యాదవ్..

ఈ పరిస్థితుల్లో వారిని రీప్లేస్ చేయాలని నిర్ణయించింది బీసీసీఐ. గాయపడ్డ ప్లేయర్ల స్థానంలో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను సెలెక్ట్ చేసింది. వచ్చే నెల 4వ తేదీన ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఆరంభం కాబోయే అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడబోయే విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా జట్టులో చేరనున్నారు. భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా సిరీస్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించకపోవడం వల్ల పృథ్వీ షాను టెస్ట్ జట్టు నుంచి తప్పించింది బీసీసీఐ. ఆ తరువాత డొమెస్టిక్ క్రికెట్‌లో అతను సత్తా చాటుకున్నాడు. శ్రీలంక సిరీస్‌లో ఫర్యాలేదనిపించుకుంటున్నాడు. దీనితో అతన్ని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసింది.

కొత్త జట్టు ఇదీ..

కొత్త జట్టు ఇదీ..

రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కేప్టెన్), అజింక్య రహానె (వైస్ కేప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్, (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్. కాగా స్టాండ్ బై ప్లేయర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ, అర్జాన్ నగ్వాస్‌వాలా వ్యవహరిస్తారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, July 31, 2021, 11:21 [IST]
Other articles published on Jul 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X