Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్కన్ చార్జర్స్ కు ఐపియల్ కప్

Deccan Chargers
జోహెన్స్ బర్గ్: ఐపియల్ - 2 ట్రోఫీని అనూహ్యంగా హైదరాబాద్ కు చెందిన దక్కన్ చార్జర్స్ గెలుచుకుంది. ఆదివారం జోహెన్స్ బర్గ్ లో నువ్వానేనా అన్నట్లు జరిగిన తుది సమరంలో డెక్కన్‌ ఛార్జర్స్‌ 6 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌పై విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యసాధనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. లక్ష్యసాధనలో బెంగళూరు మందకొడిగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. తొలి ఓవర్‌ను హారిస్‌ మెయిడెన్‌గా విసిరితే రెండో ఓవర్లో ఆర్పీ రెండే పరుగులిచ్చాడు. దీంతో తొలి రెండు ఓవర్లలో బెంగళూరు రెండే పరుగులు సాధించగలిగింది. మూడో ఓవర్లో కలిస్‌ రెండు ఫోర్లు కొట్టి స్కోరు కదిలించాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో ఆర్పీసింగ్‌ బంతిని వికెట్ల మీదకు ఆడుకొని కలిస్‌ (16) నిష్క్రమించాడు. హారిస్‌ వేసిన ఐదో ఓవర్లో వాండర్‌ మెర్వ్‌ రెచ్చిపోయాడు. రెండు సిక్స్‌లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. కానీ ఈలోపు ఓజా మాయ చేశాడు. ఫామ్‌ లో ఉన్న మనీష్‌ పాండే (4)ను తన ఓవర్‌ తొలి బంతికే బుట్టలో వేశాడు. సైమో బౌలింగ్‌లో సిక్స్‌, ఓజా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన వాండర్‌మెర్వ్‌ (32; 21 బంతుల్లో 1X4, 3X6) భారీ షాట్‌ కోసం ముందుకొచ్చి గిల్లీ చేతిలో స్టంప్‌ ఔట్‌ అయ్యాడు.

57 పరుగులకే 3 వికెట్లు పడిన స్థితిలో ద్రవిడ్‌ (9), రాస్‌టేలర్‌ (27; 20 బంతుల్లో 3X4, 1X6) కాసేపు ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. హర్మీత్‌ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ షాట్‌ కొట్టబోయి ద్రవిడ్‌ బౌల్డయ్యాడు. ఈ స్థితిలో బౌలింగ్‌కు దిగిన సైమో బెంగళూరును దెబ్బ కొట్టాడు. కుదురుకున్న టేలర్‌, కోహ్లిలను సైమో ఔట్‌ చేశాడు. ముఖ్యంగా ముందుకొచ్చి ఆడబోయిన కోహ్లిని గిల్లీ అద్భుతంగా స్టంప్‌ చేశాడు. ఆ తర్వాత హర్మీత్‌ బౌచర్‌ (5)ను ఔట్‌ చేసి బెంగళూరుకు మరో షాకిచ్చాడు. చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోవడంతో బెంగళూరు వరస వికెట్లు కోల్పోయింది. ఉతప్ప (17) ప్రయత్నం ఫలించలేదు. ఓజా (3/28) చక్కగా రాణిస్తే సైమో (2/18), హర్మీత్‌ (2/23) అతనికి సహకారం అందించారు.

కుంబ్లే (4/16) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో అంతకుముందు డెక్కన్‌ ఛార్జర్స్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. గిబ్స్‌ (53 నాటౌట్‌; 48 బంతుల్లో 3X4, 2X6) టాప్‌ స్కోరర్‌. ఎందుకంటే బెంగళూరు బౌలింగ్‌ దాడిని ఆరంభించిన కెప్టెన్‌ కుంబ్లే మూడో బంతికే ప్రమాదకర గిల్‌క్రిస్ట్‌ (0)ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత డెక్కన్‌ ఏ దశలోనూ పెద్దగా కోలుకోలేదు. ఆ జట్టు ఇన్నింగ్స్‌ సెమీస్‌కు పూర్తి భిన్నంగా నెమ్మదిగా సాగింది. 18 పరుగుల వద్ద సుమన్‌ (10) వినయ్‌కి వికెట్‌ ఇచ్చుకున్నాడు. మరోవైపు గిబ్స్‌ జాగ్రత్తగా ఆడాడు. సుమన్‌ స్థానంలో వచ్చిన సైమండ్స్‌ (33; 21 బంతుల్లో 4X4; 1X6) చెలరేగడంతో డెక్కన్‌ పుంజుకున్నట్లు కనిపించింది. కానీ 9వ ఓవర్లో కుంబ్లే మరోసారి ఆ జట్టును దెబ్బతీశాడు. జోరు మీదున్న సైమోను బౌల్డ్‌ చేశాడు. అప్పటికి స్కోరు 58/3. గిబ్స్‌, రోహిత్‌శర్మ (24; 23 బంతుల్లో 1X4, 1X6) జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్‌ వేసిన ఓవర్లో చెరో సిక్స్‌ బాది మొత్తం 20 పరుగులు పిండి జట్టు స్కోరును 100 దాటించడంతో డెక్కన్‌ ఇన్నింగ్స్‌కు వూపొచ్చింది. ఈ తరుణంలో కుంబ్లే మరోసారి డెక్కన్‌ను దెబ్బతీశాడు. ఇక చెలరేగుతాడనుకున్న దశలో రోహిత్‌ను ఔట్‌ చేశాడు. అదే ఓవర్లో వేణుగోపాలరావును వెనక్కిపంపాడు. గిబ్స్‌ చివరి వరకూ క్రీజులో ఉన్నా బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో జట్టు స్కోరును 150కి చేర్చలేకపోయాడు. వినయ్‌కుమార్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

స్కోరు వివరాలు
దక్కన్‌ ఛార్జర్స్‌: గిల్‌క్రిస్ట్‌ (బి) కుంబ్లే 0; గిబ్స్‌ నాటౌట్‌ 53; సుమన్‌ (సి) పాండే (బి) వినయ్‌ కుమార్‌ 10; సైమండ్స్‌ (బి) కుంబ్లే 33; రోహిత్‌శర్మ (సి) పాండే (బి) కుంబ్లే 24; వేణుగోపాల్‌రావు (సి) టేలర్‌ (బి) కుంబ్లే 0; బిలాఖియా ఎల్బీ (బి) వినయ్‌ కుమార్‌ 6; హారిస్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 143

వికెట్ల పతనం: 1-0, 2-18, 3-58, 4-110, 5-115, 6-134

బౌలింగ్‌: కుంబ్లే 4-0-16-4; ప్రవీణ్‌కుమార్‌ 4-0-43-0; కలిస్‌ 4-0-24-0; వినయ్‌కుమార్‌ 4-0-30-2; వాండెర్‌ మెర్వ్‌ 4-0-28-0

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్: కలిస్‌ (బి) ఆర్పీసింగ్‌ 16; పాండే (సి) గిల్‌క్రిస్ట్‌ (బి) ఓజా 4; వాండర్‌మెర్వ్‌ స్టంప్డ్‌ గిల్‌క్రిస్ట్‌ (బి) ఓజా 32; ద్రవిడ్‌ (బి) హర్మీత్‌సింగ్‌ 9; రాస్‌టేలర్‌ (సి) వేణుగోపాలరావు (బి) సైమండ్స్‌ 27; విరాట్‌ కోహ్లి స్టంప్డ్‌ గిల్‌క్రిస్ట్‌ (బి) సైమండ్స్‌ 7; బౌచర్‌ (సి) గిబ్స్‌ (బి) హర్మీత్‌సింగ్‌ 5; ఉతప్ప నాటౌట్‌ 17; ప్రవీణ్‌కుమార్‌ (సి) ఆర్పీసింగ్‌ (బి) ఓజా 2; వినయ్‌కుమార్‌ (సి) హర్మీత్‌సింగ్‌ (బి) హారిస్‌ 8; కుంబ్లే నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137

వికెట్ల పతనం: 1-20, 2-36, 3-57, 4-79, 5-99, 6-99, 7-107, 8-110, 9-129

బౌలింగ్‌: హారిస్‌ 4-1-35-1; ఆర్పీసింగ్‌ 4-0-16-1; సైమండ్స్‌ 3-0-18-2; ఓజా 4-0-28-3; హర్మీత్‌సింగ్‌ 4-0-23-2; రోహిత్‌ శర్మ 1-0-9-0
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+