Aus vs Sl 2nd Test: 12వికెట్లతో ఆసీస్ పిప్పి రాల్చిన జయసూర్య.. ఇన్నింగ్స్ తేడాతో ఓడి తోకముడిచిన కంగారులు

శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక మరో రోజు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ ప్లస్ 38పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అరంగేట్రంలోనే ప్రభాత్ జయసూర్య 12వికెట్లతో ఆస్ట్రేలియా పిప్పి రాల్చాడు. ఇక నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన శ్రీలంక.. దినేష్ చండిమాల్ (206పరుగులు 326బంతుల్లో 16ఫోర్లు, 5సిక్సర్లు నాటౌట్ ) ధాటికి 554పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్‌లో 190పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక నాలుగో రోజు మధ్యాహ్నం సెషన్ అయిపోయాక బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం 41ఓవర్లలో 151పరుగులు చేసి ఆలౌటై పరాజయం పాలయింది. ఇక తొలి టెస్టులో శ్రీలంకపై ఆసీస్ 10వికెట్ల తేడాతో నెగ్గగా.. అంతకుమించి దెబ్బకు దెబ్బ తీస్తూ.. శ్రీలంక ఏకంగా ఇన్నింగ్స్ ప్లస్ 38పరుగుల తేడాతో గెలిచి తమ పవరేంటో చూపించింది. తద్వారా ఈ సిరీస్ 1-1తేడాతో సమమైంది. ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా దినేష్ చండిమాల్ నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రభాత్ జయసూర్య నిలిచాడు.

స్టీవ్ స్మిత్ కడవరకు క్రీజులో నిలబడ్డంతో..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 364/10 స్కోర్ చేసింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్ (145పరుగులు 272బంతుల్లో 16ఫోర్లు నాటౌట్), మార్నస్ లబూషేన్ (104పరుగులు 156బంతుల్లో 12ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. ఇక శ్రీలంక బౌలర్లలో తన అరంగేట్ర టెస్టులోనే 6వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడు రజిత 2, తీక్షణ, రమేష్ మెండిస్ తలా ఒక వికెట్ తీసి సత్తా చాటారు.

ప్రభాత్ దెబ్బకు ఆసీస్ విలవిల
ఇక నాలుగో రోజు మధ్యాహ్నం సెషన్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ బ్యాటర్లు శ్రీలంక బౌలర్ల ధాటికి తేలిపోయారు. కనీసం 190పరుగుల ఆధిక్యాన్ని కూడా అధిగమించలేక చతికిల పడ్డారు. మరోసారి స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆస్ట్రేలియా బ్యాటర్ల తుక్కురేగ్గొట్టాడు. అతని దెబ్బకు ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా (29), మార్నస్ లబూషేన్ (32), స్టీవ్ స్మిత్ (0), మిచెల్ స్టార్క్ (0), కామెరున్ గ్రీన్ (23), స్వెప్సన్ (0) తోకముడిచారు. తొలి ఇన్నింగ్స్‌లో అర డజను వికెట్లు తీసిన ప్రభాత్ జయసూర్య.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అరడజన్ వికెట్లు తీసి ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అతని దెబ్బకు ముగ్గురు డకౌట్ కావడం గమనార్హం. ఇక అతనికి సహాయంగా తీక్షణ, రమేష్ మెండిస్ తలా రెండు వికెట్లు తీయడంతో శ్రీలంక విజయం మరో రోజు మిగిలి ఉండగానే ఖాయమైంది.

1992 తర్వాత ఇదే తొలిసారి
ఇకపోతే నాలుగో రోజు సోమవారం శ్రీలంక ఆసీస్ మీద ఓ రికార్డ్ నెలకొల్పింది. 1992తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాపై శ్రీలంక జట్టు 500ప్లస్ పరుగులు నమోదు చేసింది. ఈ టెస్టు మ్యాచ్ నాలుగో రోజు.. దినేష్ చండిమాల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక జట్టు ఈ ఫీట్ సాధించగలిగింది. ఇక 1992లో ఆస్ట్రేలియాపై శ్రీలంక టెస్టుల్లో 500పరుగులకు పైచిలుకు స్కోరు చేయగలిగింది. అప్పట్లో అర్జున రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు 8వికెట్ల నష్టానికి 547పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అంత భారీ స్కోరు చేసినప్పటికీ ఆ మ్యాచ్‌లో శ్రీలంకకు ఓటమి తప్పలేదు.

జట్లు
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, మిచెల్ స్వెప్సన్
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే ( కెప్టెన్), కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, నిరోషన్ డిక్వెల్లా (వికెట్), రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, ప్రబాత్ జయసూర్య, కసున్ రజిత, ఓషద ఫెర్నాండో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications