డియరెస్ట్ భాబీ..! పసిగుడ్డును హుక్కా సెంటర్‌కు తీసుకెళ్తావా? సానియాపై పాక్ నటి విసుర్లు

లాహోర్: ఒక్క పరాజయం భారం పాకిస్తాన్‌ను వెంటాడుతూనే వస్తోంది. 48 గంటల తరువాత కూడా దీనికి సంబంధించిన ప్రకంపనలు తగ్గలేదు. సరికదా! దాని తీవ్రత మరింత పెరుగుతూనే వస్తోంది. పాకిస్తాన్ దారుణంగా పరాజయం పాలు కావడానికి హైదరాబాద్‌కు చెందిన స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఓ కారణం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీమిండియాతో మ్యాచ్‌కు ముందురోజు రాత్రి తన భర్త, పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యుడు, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ సహా తోటి ఆటగాళ్లతో కలిసి మాంఛెస్టర్‌లో పార్టీకి తీసుకెళ్లారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు.

పసివాడిని హుక్కా సెంటర్‌కు తీసుకెళ్తావా?
దీనిపై అటు సానియా మీర్జా ఇటు షోయబ్ మాలిక్ వివరణలు ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. దాని తాలూకు తీవ్రత తగ్గలేదు. తాజాగా- పాకిస్తాన్‌కు చెందిన నటి వీణా మాలిక్ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. ప్రత్యేకించి.. సానియా మీర్జాను టార్గెట్‌గా చేసుకున్నారామె. మాంఛెస్టర్‌లోని విల్‌స్లో రోడ్డులో ఉన్న 360 శీషా రెస్టారెంట్‌కు సానియా మీర్జా తన ఏడాది వయస్సున్న కుమారుడు ఇజహాన్‌ను కూడా తీసుకెళ్లారని వీణా మాలిక్ చెబుతున్నారు. 360 శీషా రెస్టారెంట్ అనేది ఓ హుక్కాసెంటర్ అని, అలాంటి చోటికి పసివాడిని తీసుకెళ్తే, అతని ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నించారు. చిన్నపిల్లాడి పట్ల కనీస బాధ్యత లేదా? అంటూ వీణామాలిక్ ఆమెను నిలదీశారు. దీనిపై ఆమె వరుసగా ట్వీట్లను సంధించారు. వాటిని సానియాకు ట్యాగ్ చేశారు.
నువ్వు కూడా నీతులు చెబుతున్నావా?
వీణా మాలిక్ తనను నిలదీయడాన్ని జీర్ణించుకోలేకపోయారు సానియా మీర్జా. అసలే పాకిస్తాన్ జట్టు దారుణంగా ఓటమి పాలుకావడం, దీనికి తనను బాధ్యురాలిని చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు, మెమెలు వస్తుండటంతో సహనం కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో వీణా మాలిక్ చేసిన ట్వీట్లు ఆమెను చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. దీనితో ఆమె- తన ఆగ్రహాన్నంతటినీ వీణాపై చూపించారు. తానూ వరుస ట్వీట్లు చేస్తూ- వీణాపై విరుచుకుని పడ్డారు. ఈ రకంగా వారిద్దరి మధ్య చాలాసేపటి వరకు ట్వీట్ల యుద్ధం సాగింది. తల్లి అయ్యాక కూడా పిల్లలు ఏమనుకుంటారో అని పట్టించుకోకుండా మ్యాగజైన్లకు సెక్సీ ఫోజులు ఇచ్చే వీణా కూడా నీతులు చెబుతున్నారంటూ ట్వీట్ చేసింది సానియా.

నగ్నంగా ఫోజులిచ్చిన వీణా మాలిక్
పాకిస్తాన్‌కు చెందిన నటి వీణా మాలిక్. కాస్త సెక్సీపాళ్లు ఎక్కువే. గతంలో ఎఫ్‌హెచ్ఎం అనే మేగజైన్‌కు ఆమె న్యూడ్‌గా ఫోజులిచ్చింది. కవర్ పేజీల్లో ప్రచురితం అయ్యాయి ఆ ఫొటోలు. తాజాగా సానియా మీర్జా దాన్నే పాయింట్ అవుట్ చేశారు. పిల్లలకు తల్లయిన తరువాత కూడా మేగజైన్ల కవర్ పేజీలపై నగ్నంగా ఫోజులు ఇచ్చే వీణా మాలిక్ కూడా నీతులు చెబుతున్నారంటూ ఎదురుదాడికి దిగారు.
జీర్ణించుకోలేకపోయారు సానియా మీర్జా.
వీణా మాలిక్ తనను నిలదీయడాన్ని జీర్ణించుకోలేకపోయారు సానియా మీర్జా. అసలే పాకిస్తాన్ జట్టు దారుణంగా ఓటమి పాలుకావడం, దీనికి తనను బాధ్యురాలిని చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు, మెమెలు వస్తుండటంతో సహనం కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో వీణా మాలిక్ చేసిన ట్వీట్లు ఆమెను చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. దీనితో ఆమె- తన ఆగ్రహాన్నంతటినీ వీణాపై చూపించారు. తానూ వరుస ట్వీట్లు చేస్తూ- వీణాపై విరుచుకుని పడ్డారు. ఈ రకంగా వారిద్దరి మధ్య చాలాసేపటి వరకు ట్వీట్ల యుద్ధం సాగింది. తల్లి అయ్యాక కూడా పిల్లలు ఏమనుకుంటారో అని పట్టించుకోకుండా మ్యాగజైన్లకు సెక్సీ ఫోజులు ఇచ్చే వీణా కూడా నీతులు చెబుతున్నారంటూ ట్వీట్ చేసింది సానియా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications