Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కజ్‌రా రే' పాటకు కోహ్లీ డ్యాన్స్ (వీడియో)

Dear Anushka Sharma, have you seen Virat Kohli dancing to 'Kajra Re' at friend's wedding?

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. విరామాన్ని ఆరామ్‌గా వదిలేయక వీలైనంత వరకు పార్టీ మూడ్‌లోనే ఎంజాయ్ చేస్తున్నాడు. సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి సినిమాలకు, పార్టీలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

తాజాగా కోహ్లీ తన స్నేహితుడి వివాహానికి హాజరయ్యాడు. అతడున్న ప్రదేశంలో వూపు వచ్చే సాంగ్స్ ఉంటే విరాట్‌ని అపలేం. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ పెళ్లి కొడుకుతో పాటుగా డ్యాన్స్ చేశాడు. వేడుకలో ఫేమస్ హిందీ పాట 'కజ్‌రా రే' పాటకు స్టెప్పులతో అదరగొట్టాడు. మరోవైపు ఈ సెలబ్రేషన్స్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా పాల్గొని తనదైన శైలిలో ఎంజాయ్ చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా విరాట్ ఏ వేడుకకి హాజరైనా తనదైన శైలిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంటాడు. తన పెళ్లి వేడుకలోనూ అనుష్కతో కలిసి విరాట్ డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్స్‌లో షారూఖ్ వేస్తున్న స్టెప్పులను అనుకరిస్తూ.. అనుష్కతో కలిసి చిందులేశాడు ఈ క్రికెట్ హీరో.

ప్రస్తుతం శ్రీలంక పర్యటన నుంచి కోహ్లీకి విశ్రాంతినిచ్చి రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన తొలిపోరులో భారత జట్టు లంకతో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. రెండో మ్యాచ్‌ను భారత్ మార్చి 8వ తేదీ బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

Story first published: Wednesday, March 7, 2018, 10:25 [IST]
Other articles published on Mar 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+