For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్ స్ధానాన్ని కోహ్లీ భర్తీ చేశాడు: ఫ్యాన్‌గా మారడంపై జోన్స్

By Nageshwara Rao
Dean Jones reveals how Ravi Shastri brings best out of Team India skipper Virat Kohli

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలోని అత్యుత్తమ ఆటగాడిని ఆ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి బయటకు తీశాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ వెల్లడించాడు. నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోహ్లీ అద్భుతమైన షాట్లను ఆడాడు. దీంతో డీన్ జోన్స్ కోహ్లీకి అభిమాని అయిపోయాడు. అంతేకాదు దూకుడుగా ఆడే కోహ్లీ స్వభావం తనకెంతో ఇష్టమని డీన్ జోన్స్ చెప్పడం విశేషం. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో డీన్ జోన్స్.. కోహ్లీ గురించి స్పందించాడు.

Dean Jones reveals how Ravi Shastri brings best out of Team India skipper Virat Kohli

'కోహ్లీ నా అభిమాన ఆటగాడు. సెహ్వాగ్‌ స్థానాన్ని అతడు భర్తీ చేశాడు. ఎందుకంటే కోహ్లీకి ముందు నేను సెహ్వాగ్‌ అభిమానిని. దూకుడుగా ఆడే కోహ్లీ స్వభావం నాకు ఎంతో నచ్చుతుంది. ఎలాంటి పిచ్‌పైన అయినా అతడు సులువుగా పరుగులు రాబడతాడు' అని అన్నాడు.

'తాజాగా కోహ్లీలోని అత్యుత్తమ ఆటగాడిని కోచ్‌ రవిశాస్త్రి బయటకు తీశాడు. భవిష్యత్తులో భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో కూడా కోహ్లీ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు' అని డీన్ జోన్స్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

'బౌలింగ్‌ భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుత జట్టులో మంచి పేసర్లు ఉన్నారు. మహమ్మద్‌ షమి బంతులేసే తీరు నన్ను ఆశ్చర్యపరుస్తోంది. స్పిన్నర్లలో అశ్విన్‌ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో కోహ్లీ సేన రాణిస్తే దక్షిణాఫ్రికా పర్యటనలో విజయం సాధిస్తారు' అని జోన్స్‌ తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్‌‌కు వీడ్కోలు పలికిన తర్వాత డీన్ జోన్స్‌ ప్రస్తుతం కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నాగ్ పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీసేన శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇరు జట్ల మధ్య డిసెంబర్ 2న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్ అనంతరం డిసెంబర్ 10 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరిస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరిస్‌కు కోహ్లీ స్ధానంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 29, 2017, 17:50 [IST]
Other articles published on Nov 29, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+