హైదరాబాద్: ఆస్ట్రేలియన్లు గెలుపు కోసం ఏమైనా చేస్తారు. ఏమైనా అంటే స్లెడ్జింగ్ లాంటిది. ఇదే విషయం చాలా సార్లు రుజువైంది కూడా. అయితే ఓటమిని మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు. తాము ఓడిపోతే అదే ప్రత్యర్థి టీమ్‌పై ఏవో నోటికొచ్చిన ఆరోపణలు చేసి సాకులు వెతుక్కుంటారు.
తాజాగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఓడిన తర్వాత ఆ టీమ్ మాజీ ప్లేయర్ డీన్ జోన్స్ చేసిన ఓ ట్వీట్ భారత అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఇండియా గెలవాలంటే కాస్త వర్షం కురవాలన్న మాట అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
'నా వరకూ అయితే టీమిండియా గెలుపుకు వర్షం సహకరించింది. వారు విజయం సాధించాలంటే వర్షం పడాలేమో. అయినా ఫర్వాలేదు. ఇక రెండో గేమ్‌తో ఆసీస్ విజయాల బాట పట్టాలి' అంటూ టీమిండియా విజయాన్ని తక్కువ చేసి ట్వీట్ చేశాడు.
డీన్ జోన్స్ ట్వీట్‌పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. నీకేమైనా బ్రెయినక్ ఫేడ్ అయ్యిందా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ క్రికెటర్‌కు బ్రెయిన్ ఫేడ్ అయిందంటూ అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.
తాజాగా ఇప్పుడు మరో ఆస్ట్రేలియన్ ఆ జాబితాలో చేరిపోయాడంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగా, వర్షం అనేది రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ ఉపయోగపడుతుంది. నువ్వు కొంత క్రికెట్ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి ఉంది. తెలుసుకోలేక పోతే చాలా కష్టం' అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు,
'సైకియాట్రిస్ట్‌కు చూయించుకో అని ఒకరు ట్వీట్ చేయగా.. 'భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నావ్.. మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లు' అని మరొకరు ట్విట్టర్‌లో డీన్ జోన్స్‌ను ట్రోల్ చేస్తున్నారు.