For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండు నిమిషాలే షవర్‌ వాడుకోమన్నారు: డీన్ ఎల్గర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోకులు

Dean Elgar criticised heavily for complaining about hotels, food in India

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్‌ ఎల్గర్‌పై సోషల్ మీడియాలో భారత అభిమానులు జోకులు పేల్చుతున్నారు. మూడో టెస్టు మ్యాచ్‌కి ముందు డీన్ ఎల్గర్ మాట్లాడుతూ "భారత పర్యటన అత్యంత సవాల్‌తో కూడుకున్నది. భారత్‌లో పర్యటిస్తే ఒక క్రికెటర్‌గా మనమేంటో తెలుస్తుంది. ఇక్కడి హోటళ్లు అంతగా బాగాలేకపోయినా.. మైదానాలు మాత్రం సవాళ్లు విసురుతాయి" అని ఎల్గర్‌ అన్నాడు.

ఈ నేపథ్యంలో డీన్ ఎల్గర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. 2017-18 సీజన్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు కేప్‌టౌన్‌ హోటల్లో భారత ఆటగాళ్లకు కేవలం రెండు నిమిషాలే షవర్‌ వాడుకోవాలని చెప్పిన నాటి పరిస్థితులను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

సఫారీ జట్టు ఓటమికి క్రికెట్‌ అంశాలు కాకుండా ఇతర అంశాలను కారణాలుగా చూపుతున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ అయితే ఇతడు ఓ మంచి ఏడుపు ఏడ్చేందుకు అర్హుడంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టీమిండియా లంచ్ విరామానికి 23 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(38), రహానే(11) పరుగులతో ఉన్నారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడకు రెండు, అన్రిచ్ నోర్ఝికు ఒక వికెట్ లభించింది. ఇప్పటికే విశాఖ టెస్టులో 203 పరుగులు, పుణె టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.

రాంచీ టెస్టులో టీమిండియా గెలిస్తే దక్షిణాఫ్రికాను వైట్‌వాష్‌ చేసిన తొలి జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. మూడు లేదా అంతకుమించి మ్యాచ్‌ల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల ఇదే తొలి వైట్‌వాష్ సిరిస్ అవుతుంది.

Story first published: Saturday, October 19, 2019, 12:41 [IST]
Other articles published on Oct 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+