Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చహల్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన డివిలియర్స్!!

De Villiers replied to Yuzvendra Chahals comment and asked him to behave yourself

బెంగళూరు: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ సోషల్ మీడియా వేదికగా చేసే హడావుడి మాములుగా ఉండదు. భారత పర్యటనల సందర్భంగా 'చహల్ టీవీ' ద్వారా సహచర ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసేవాడు. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా క్రీడా టోర్నీలు రద్దవ్వడం.. ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడటంతో టీమిండియా ఇంటికే పరిమితమయ్యాడు. చహల్ ఈ క్వారంటైన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ.. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ముఖ్యంగా టిక్‌టాక్ వీడియోలతో హల్‌చల్ చేస్తున్నాడు.

యుజువేంద్ర చహల్ చేసిన ఫన్నీ టిక్‌టాక్ వీడియోలు కొన్ని విసిగించేలా ఉండటంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తదితరులు మండిపడ్డారు. ముఖ్యంగా యువరాజ్ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో చాహల్‌ని భాంగీలతో పోల్చాడు. కానీ దానిపై వివాదం చెలరేగడంతో క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియాలో టిక్‌టాక్ వీడియోలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా.. చహల్ మాత్రం తన తీరుని మార్చుకోవడం లేదు.

తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కి యుజువేంద్ర చహల్ కోపం తెప్పించాడు. ఇటీవల సెలబ్రెటీలు చేస్తున్న#SwagStepChallenge‌ని స్వీకరించిన డివిలియర్స్.. డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి యువరాజ్ సింగ్ 'భలే స్టెప్ట్స్ వేశావ్' అని కాప్షన్ ఇచ్చాడు. చహల్ మాత్రం 'వాట్‌ ఎ స్వాంగ్ సార్' అని కళ్లుమూసుకున్న కోతి ఎమోజీని జత చేశాడు. దీంతో ఫైర్ అయిన డివిలియర్స్ 'చహల్.. నీ హద్దుల్లో నువ్వు ఉండు' అని వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డివిలియర్స్, చాహల్ సుదీర్ఘకాలంగా ఆడుతున్నారు.

ఇటీవల విరాట్ కోహ్లీ.. చహల్ హెయిర్‌స్టైల్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. చహల్ కటింగ్ చూసి అతని కుక్కలు వెంటబడినట్లున్నాయన్నాడు. 'చహల్.. నీకు హెయిర్ కటింగ్ ఎవరు చేశారు?' అని విరాట్ ప్రశ్నించగా... 'మా దీదీ సాయంతో నేనే చేసుకున్నా' అని ఈ లెగ్ స్పిన్నర్ సమాధానమిచ్చాడు. దీనికి విరాట్ బదులిస్తూ 'అవునా.. నీ కటింగ్ చూసి మీ కుక్కలు నీ వెంటబడ్డాయనుకుంటా' అని సెటైర్లు పేల్చాడు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో క్రిస్ గేల్ మాట్లాడుతూ.. చహల్ తింగరేషాలపై అసహనం వ్యక్తం చేశాడు. మళ్లీ అతన్ని చూడనని బ్లాక్ చేస్తున్నట్లు తెలిపాడు. 'చహల్‌.. నిన్ను బ్యాన్‌ చేయాలని టిక్‌టాక్‌ను కోరుతా.. నువ్వు సోషల్‌మీడియాలో చాలా చిరాకు తెప్పిస్తున్నావు. అసలు ఉన్నపళంగా నువ్వు సోషల్‌మీడియాను వదిలేయి. నిన్ను భరించలేకపోతున్నాం. నిన్ను మళ్లీ నా జీవితంలో చూడను. అందుకే బ్లాక్ చేస్తున్నా' అని గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, June 6, 2020, 15:47 [IST]
Other articles published on Jun 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+