For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చారిత్రాత్మక టెస్టు నుంచి డుప్లెసిస్ ఔట్: డివిలియర్స్‌కే కెప్టెన్సీ పగ్గాలు

By Nageshwara Rao
De Villiers named stand-in captain as Du Plessis ruled out of Zimbabwe Test

హైదరాబాద్: జింబాబ్వేతో జరగనున్న నాలుగు రోజుల బాక్సింగ్ డే టెస్టుకు ఏబీ డివిలియర్స్ తాత్కాలిక కెప్టెన్‌గా సారథ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఈ మేరకు క్రికెట్ దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఈ ప్రకటన చేసింది.

రెగ్యులర్ కెప్టెన్ డుఫ్లెసిస్ గాయం నుంచి కోలుకోక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. దీంతో జనవరి 2016 తర్వాత టెస్టు జట్టులో పునరాగమనం చేసిన తర్వాత డివిలియర్స్ సారథ్యం వహిస్తున్న టెస్టు మ్యాచ్ ఇదే కావడం విశేషం.

అయితే జనవరి 5 నుంచి భారత్‌తో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కల్లా డుప్లెసిస్ అందుబాటులోకి వస్తాడని తెలిపింది. దీనిపై దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ డాక్టర్ మహమ్మద్ మొసాజీ మాట్లాడుతూ 'వెన్నుముక, భుజం గాయాల నుంచి డుప్లెసిస్ నెమ్మదిగా తేరుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌కి అందుబాటులోకి వస్తాడని అనుకున్నాం' అని తెలిపాడు.

'అయితే మరో వారం రోజులు ఆగితే అతడికి పూర్తిగా నయమవుతుందని వైద్యలు చెప్పారు. ప్రస్తుతం అతడు ఫిజియోథెరపిస్ట్ గ్రెగ్ గోవెండర్ పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. జనవరి 5న కేప్ టౌన్ వేదికగా భారత్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నాం' అని అన్నాడు.

'ఏబీ డివిలియర్స్‌కు దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టు ఫార్మాట్‌కు సారథ్యం వహించిన అనుభవం ఉంది. అతి తక్కువ సమయంలో ఏబీ డివిలియర్స్ సారథ్య బాధ్యతలను స్వీకరించేందుకు ముందుకు వచ్చినందుకు అతడికి ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు.

టెస్టు క్రికెట్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్న ఈ నాలుగురోజుల టెస్టుకు అంతా రంగం సిద్ధమైంది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే పోటీపడుతున్న ఈ డే/నైట్‌ టెస్టు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌కు కొన్ని నిబంధనల్లో మార్పులు చేశారు.

నాలుగు రోజుల టెస్టులో చేసిన మార్పులు:
* ఐదు రోజుల ఆటలో రోజుకు ఆరు గంటలు ఆడనుండగా.. ఈ టెస్టు అరగంట సేపు ఎక్కువగా అంటే ఆరున్నర గంటలపాటు సాగనుంది.
* ఇక ఓవర్ల విషయానికి వస్తే రోజుకు 98 ఓవర్లు వేయనున్నారు.
* ఫాలో ఆన్‌ ఇవ్వడానికి 150 పరుగుల ఆధిక్యం సరిపోతుంది. ఐదు రోజుల మ్యాచ్‌లో ఈ పరుగుల సంఖ్య 200గా ఉంది.
* మొదటి రెండు సెషన్లు రెండు గంటలకు బదులుగా.. 2 గంటల 15 నిమిషాలకు పెంచారు.
* తొలిసెషన్‌ తర్వాత లంచ్‌కు బదులు 20 నిమిషాల టీ బ్రేక్‌ ఇవ్వనున్నారు. రెండో సెషన్‌ తర్వాత 40 నిమిషాల డిన్నర్‌ బ్రేక్‌ ఇస్తారు.
* 1972/73 తర్వాత నాలుగు రోజుల పాటు జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.

దక్షిణాఫ్రికా Vs జింబాబ్వే (ఏకైక టెస్టు)
వేదిక: పోర్ట్ ఎలిజిబెత్‌లోని సెయింట్ జార్జి పార్క్
మ్యాచ్ సమయం: సాయంత్రం 5 గంటలకు - సోనీ నెట్ వర్క్‌లో

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 15:18 [IST]
Other articles published on Dec 26, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+