Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్ భార్యని డీకాక్ ఏమన్నాడో తెలుసా?: ఆస్ట్రేలియా వెబ్‌సైట్

De Kock used derogatory words about Warner's wife, instigated commotion: Reports

హైదరాబాద్: డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్‌లు పరస్పరం దూషించుకోవడం అంతర్జాతీయ క్రికెట్‌లో తీవ్ర కలకలం సృష్టించింది.

తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలో ఇచ్చిన టీ విరామ సమయంలో వీరిద్దరూ డ్రెస్పింగ్ రూమ్‌కి వెళ్లేటప్పుడు మెట్ల వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగారు. సహచర ఆటగాళ్లు వద్దు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు.

మైదానంలో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ... మెట్లు ఎక్కుతుండగా డికాక్‌ను వార్నర్‌ ఆవేశంగా దూషించాడు. దీనికి డికాక్‌ కూడా దీటుగానే సమాధానం ఇచ్చాడు. అయితే, సహచరులు టిమ్‌ పైన్‌, ఖవాజా, ఓ అధికారి వారిస్తున్నా వినకుండా వార్నర్‌.. క్వింటన్‌ను కొట్టేందుకు దూసుకెళ్లాడు.

De Kock used derogatory words about Warner's wife, instigated commotion: Reports

ఈ గొడవ ఎక్కువవడంతో సఫారీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ బయటకు వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్‌ స్మిత్‌ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఈ వీడియోను స్థానిక మీడియా బయటపెట్టడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. గొడవ ఎలా మొదలైందో అనే విషయంపై విచారణ చేస్తున్నామని, నిజానిజాలు తెలిసేవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు.

తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా నివేదిక ప్రకారం డేవిడ్ వార్నర్ భార్య కాండిస్‌‌పై డీకాక్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ గొడవపై స్పందించాడు. క్వింటన్ డికాక్.. డేవిడ్ వార్నర్‌‌ని వ్యక్తిగతంగా దూషించడం వల్లే గొడవ మొదలైందని స్మిత్ పేర్కొన్నాడు.

'మేము మైదానంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో చాలా సంతోషంగా ఉన్నాం. క్వింటన్‌‌తో మాకు ఎటువంటి గొడవ జరుగలేదు. కానీ డికాక్ మాత్రం అతని పరిథి దాటి మాట్లాడాడు. నా దృష్టిలో ఇది చాలా తప్పు. ఇప్పుడు ఇక నిర్ణయం అధికారుల చేతిలో ఉంది. మేం మాత్రం క్రీడాస్పూర్తిని పాటిస్తూ ఆడుతున్నాం' అని స్మిత్ అన్నాడు.

వార్నర్ భార్య కాండిస్ గురించి డీకాక్ ఏం కామెంట్ చేశాడనే దానిపై స్పష్టత లేదు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వెబ్‌సైట్ తెలిపింది. కాండిస్‌పై డికాక్‌ కామెంట్‌ చేశాడని.. అదే అతని ఆగ్రహానికి కారణమై ఉండొచ్చని అందులో పేర్కొంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కాండిస్‌ ఆస్ట్రేలియా ప్రొఫెషనల్‌ ట్రయాథ్లెట్‌, మోడల్‌, సర్ఫ్‌ లైఫ్‌ సేవర్‌.

డేవిడ్ వార్నర్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమె పలువురు స్టార్‌ ప్లేయర్లతో డేటింగ్‌ చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకొనే డికాక్‌ ఆమెపై కామెంట్‌ చేసి ఉంటాడనీ.. ఇదే గొడవకు కారణమై ఉంటుందని ఆ వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన మ్యాచ్‌ రెఫరీ జెఫ్‌ క్రోవ్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరోవైపు ఈ ఘటనపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన బాగుండేలా అంపైర్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. 'రెండు వైపుల నుంచి వ్యక్తిగత విమర్శలు, దూషణలు చోటుచేసుకున్నాయని విన్నా. దీన్ని ఎవరు మొదలు పెట్టారో మాత్రం తెలియదు. ఒకవేళ ఇది మైదానంలోనే ప్రారంభమైతే.. దాన్ని మొగ్గదశలోనే తుంచాలి' అని చెప్పాడు.

Story first published: Tuesday, March 6, 2018, 14:23 [IST]
Other articles published on Mar 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+