హైదరాబాద్: దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకించింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరిస్‌కు కెప్టెన్‌గా అతడిని తొలిగించింది. అతడి స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయడంతో పాటు ఈ సిరిస్‌కు అతడిని ఎంపిక చేయక పోవడం విశేషం. ఇంగ్లాండ్‌తో వన్డే సిరిస్‌కు క్వింటన్ డీకాక్ సారథ్యం వహించనున్నాడు.
వన్డే సిరీస్ కోసం బావుమా, ఎంగిడిలు మళ్ళీ జట్టులో చోటు దక్కించుకోగా వీరితోపాటు ఐదుగురు కొత్త వారికి బోర్డు చోటు కల్పించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరుగుతోంది.
కివీస్ పిచ్‌లో మార్పులు, చల్లని గాలులు వీస్తే ఏం చేయాలంటే: కోహ్లీసేనకు సచిన సలహా
నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలుచుకొని 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు జనవరి 24 నుండి జోహెన్స్ బర్గ్ వేదికగా ప్రారంభం కానుంది. టెస్టు సిరిస్ పూర్తయ్యాక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత డుప్లెసిస్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వరుసగా టెస్ట్ సిరీస్‌లు ఓడిపోవడంతో డుప్లెసిస్ కొంత ఒత్తిడికిలోనైట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా ఆడిన ఎనిమిది సిరిస్‌ల్లో ఏడింట ఓటమి పాలైంది.
కాంబ్లికి చాలెంజ్ విసిరిన సచిన్.. వారం రోజులు గడువు.. చాలెంజ్ ఏంటో తెలుసా?
ఇంగ్లాండ్‌తో వన్డే సిరిస్‌కు దక్షిణాప్రికా జట్టు:
క్వింటన్ డికాక్ (కెప్టెన్, కీపర్), బావుమా, వాన్ డెర్ దుస్సేన్, డేవిడ్ మిల్లర్, జానెమన్ మలన్, జాన్ జాన్ స్మట్స్, ఫెహ్లుక్వయో, లుతో సిఫామ్లా, షంసి, ఫార్ట్యూన్, సీసండా మగలా, కైల్ వెర్రేయన్, రిజా హెన్డ్రిక్స్, బ్యురేన్ హెన్డ్రిక్స్, లుంగి ఎంగిడి