For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్రాండ్‌హోమ్‌ రెండో ఫాస్టెస్ట్ సెంచరీ: వెల్లింగ్టన్ టెస్టులో కివీస్ ఆధిపత్యం

By Nageshwara Rao
De Grandhomme stars with quick-fire century, New Zealand in control against West Indies

హైదరాబాద్: న్యూజిలాండ్ క్రికెటర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌ అరుదైన ఘనత సాధించాడు. వెల్లింగ్టన్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ తరపున టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించాడు.

న్యూజిలాండ్ vs వెస్టిండిస్ తొలి టెస్టు స్కోరు కార్డు

తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఇది కివీస్ తరపున టెస్టుల్లో రెండో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. గతంలో 2015-16 సీజన్‌లో ఆసీస్‌‌తో జరిగిన టెస్టులో బ్రెండన్‌ మెకల్లమ్‌ 54 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఆ తర్వాత న్యూజిలాండ్ తరుపున టెస్టుల్లో గ్రాండ్‌హోమ్‌ చేసిన సెంచరీనే రెండో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. ఇదిలా ఉంటే తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 127 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 447 పరుగులు చేసింది.

గ్రాండ్‌హోమ్‌ 74 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో బ్లెండెల్ 57, ట్రెంట్ బౌల్డ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 2, 2017, 13:40 [IST]
Other articles published on Dec 2, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+