Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంచనలం: 65 ఏళ్ల రికార్డు చెరిపేసిన కివీస్ బౌలర్

క్రైస్ట్ చర్చ్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే న్యూజిలాండ్ బౌలర్ కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ సంచలనం సృష్టించాడు. రెండు మ్యాచ్‌ల సిరిస్ సందర్భంగా పాకిస్థాన్‌తో క్రైస్ట్ చర్చ్ జరుగుతున్న తొలి టెస్టులో కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

అరంగేట్రం మ్యాచ్‌లో 41 పరుగులకే 6 వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించాడు. అంతేకాదు న్యూజిలాండ్ తరుపున 65 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ఓ అరంగేట్రం టెస్టులో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన కివీస్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

De Grandhomme, Raval make it New Zealand's day

1951లో ఇదే వేదికపై కివీస్ ఆటగాడు అలెక్స్ మెయిర్(6/155) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అయితే తాజాగా గ్రాండ్‌హోమ్ అత్యుత్తమ ప్రదర్శనకు అలెక్స్ రికార్డు బద్దలైంది. మొత్తంగా చూస్తే ఎనిమిది మంది కివీస్ బౌలర్లు తమ తొలి టెస్టులోనే ఐదు అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టారు.

తొలి టెస్టు తొలి రోజు ఆట పూర్తిగా రద్దు కాగా... రెండో రోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ గ్రాండ్‌హోమ్ దెబ్బకు విలవిలలాడింది. గ్రాండ్‌హోమ్ దెబ్బకు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. పాకిస్థాన్ కెప్టెన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ చేసిన 31 పరుగులకే అత్యధికం కావడం విశేషం.

కివీస్ బౌలర్లు సౌతీ, బౌల్ట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో3 వికెట్లు 104 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రావల్ (55), నికోలస్ (29) పరుగులతో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆమిర్, సోహైల్, రాహత్‌లకు తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+