అరుదైన గౌరవం: జైట్లీ స్టేడియంలో ఓ స్టాండ్‌కి గంభీర్ పేరు, ట్విట్టర్‌లో ఫోటోలు

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు అరుదైన గౌరవం లభించింది. రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు గంభీర్ పేరు పెట్టారు. ఈ స్టాండ్‌ను మంగళవారం గంభీర్ ఆవిష్కరించాడు. దీనికి సంబంధించిన చిత్రాలను గంభీర్ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
"అరుణ్ జైట్లీ నాకు తండ్రిలాంటి వారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓ స్టాండ్‌కు నాపేరు పెట్టినందుకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. నాకు అండగా నిలిచినందుకు అపెక్స్ కౌన్సిల్, స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులకు కతృజ్ఞతలు" అంటూ తన పేరిట ఉన్న స్టాండ్‌కు సంబంధించిన ఫోటోలను గంభీర్ ట్వీట్ చేశాడు.

2003లో వన్డే క్రికెట్ అరంగ్రేటం
2003లో వన్డే క్రికెట్ అరంగ్రేటం చేసిన గంభీర్ ముంబైలోని వాంఖడె వేదికగా శ్రీలంకతో జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్ పైనల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించాడు. 2011 వరల్డ్‌కప్ తర్వాత గంభీర్ పేలవ ప్రదర్శన చేయడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 2012, 2014 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ట్రోఫీలను అందించాడు.

2009లో ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా
టెస్టుల్లో సైతం గంభీర్ రికార్డు బాగానే ఉంది. 2008 జులై నుంచి 2010 జనవరి మధ్య కాలంలో తాను ఆడిన 13 టెస్టుల్లో 8 సెంచరీలు సాధించాడు. 2009లో ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 2009లో నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో గంభీర్ ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమానికీ గుర్తే.

2018 డిసెంబర్‌లో క్రికెట్‌కు వీడ్కోలు
2018 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంభీర్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీల చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా ఉన్నారు. టెస్టుల్లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీరే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications