ఇక ఆధికారికంగా: ఫిరోజ్ షా కోట్ల స్టేడియానికి 'అరుణ్ జైట్లీ' పేరు

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరుని అరుణ్ జైట్లీ స్టేడియంగా అధికారికంగా మార్చారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పేరు మార్పు కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అరుణ్ జైట్లీకి ఘనంగా నివాళులర్పించిన అతిథులు జైట్లీ సేవలను ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. మరోవైపు మైదానంలో ప్రేక్షకులు కూర్చేనే ఓ స్టాండ్‌కు విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు తీమణి అనుష్క శర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు. ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎక్కువ మంది అభిమానులు మ్యాచ్‌ని వీక్షించేందుకు వీలుగా కోట్లా స్టేడియం కెపాసిటీని సైతం అరుణ్ జైట్లీ పెంచారు.
దీంతో పాటు ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో కీలకంగా వ్యవహారించారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో వరల్డ్ క్లాస్ డ్రెస్సింగ్ రూమ్స్‌ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. కొన్నేళ్లుగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. ముఖ్యంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది యువ క్రికెటర్లను ప్రొత్సహించారు.
దీంతో జైట్లీ మరణాంతరం ఆయన స్మారకార్థం ఫిరోజ్ షా కోట్లా మైదానానికి జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిర్ణయించింది. అయితే గ్రౌండ్‌కు మాత్రం పాత పేరునే కొనసాగించాలనే ఆలోచనలో ఉంది. అరుణ్ జైట్లీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాము ఈ స్థాయికి వచ్చామని వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, అశిష్ నెహ్రాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications