
హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా జరిగిన ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య హోరాహోరీ పోరులో కేవలం 4పరుగుల తేడాతో పంజాబ్‌ను ఢిల్లీ ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి తడబడింది. అయినా చివరికి కుదురుకుని ఆడినా ఉపయోగం లేకుండా పోయింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ యువ క్రికెటర్ ఆవేశ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే ఓపెనర్ అరోన్ ఫించ్(2) వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో పడినా కూడా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 15 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌లు బాది (23) తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ఫ్లంకెట్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని ఫోర్ బాదిన రాహుల్ మంచి జోరుమీదున్నాడు. తెలివిగా వ్యవహరించిన ఫ్లంకెట్ స్లో బంతి విసరగా రాహుల్ గ్యాప్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించే లోపే బంతి గాల్లోకి లేచింది.
షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆవేశ్ ఖాన్ డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. దీంతో ప్రమాదకర రాహుల్ ఔటవడంతో ఢిల్లీ ఊపిరిపీల్చుకుంది. రాహుల్ ఔటయ్యే సమయానికి పంజాబ్ స్కోరు 4.3 ఓవర్లలో 42/2. మ్యాచ్‌లో ఢిల్లీపై పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
మ్యాచ్ మొత్తం మీద 'పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డును ఆవేశ్‌ఖాన్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆవేశ్ ఖాన్ అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.