ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. అంతకుముందు హైదరాబాద్‌లో ఢిల్లీ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో సన్‌రైజర్స్ బదులిచ్చినట్లు అయింది. ఈ క్రమంలోనే ఇలా ఓడిపోవడంపై ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.
'ఇది చాలా మంచి వికెట్. తొమ్మిది రన్స్ తేడాతో ఓడిపోవడం గొప్ప ఫీలింగ్ కాదు. ఈ మ్యాచ్‌లో మేం కొంచెం ఆఫ్‌గా ఉన్నాం. మిచెల్ మార్ష్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో అతను సూపర్‌గా బౌలింగ్ చేశారు. మా బెస్ట్ బౌలర్ అతనే అని చెప్పొచ్చు. కానీ ఇలా తొమ్మిది రన్స్ తేడాతో ఓడిపోవడం చాలా బాధాకరంగా ఉంది' అని వార్నర్ చెప్పాడు.

'సన్‌రైజర్స్ బౌలర్లు ఎక్కువగా పేస్ లేని బంతులు వేశారు. ఏదేమైనా ఇద్దరు ఆటగాళ్లు చక్కగా బ్యాటింగ్ చేస్తే.. వాళ్లిద్దరిలో ఒకరు భారీ స్కోరు చేసి గెలిపించడం చాలా ముఖ్యం. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోయి, సరైన భాగస్వామ్యాలు లేకపోతే అది చాలా కష్టం అయిపోతుంది. అక్షర్ పటేల్ మంచి టచ్‌లో ఉన్నాడు. అయితే మాకు ఆరంభంలో మంచి ఇన్నింగ్స్ ఒకటి పడింది. కాబట్టి చివర్లో అక్షర్ ఇన్నింగ్స్ పడితే గెలవడం ఖాయం అనుకున్నా' అని వార్నర్ వివరించాడు.
తమ జట్టులో ఇద్దరే లెఫ్ట్ హ్యాండర్లు ఉన్న క్రమంలో అక్షర్ బ్యాటింగ్ చాలా కీలకం అవుతుందని అర్థం చేసుకున్నామని వార్నర్ అన్నాడు. ఈ క్రమంలోనే ముందుగా వేరే ఇద్దరు బ్యాటర్లను పంపి, అక్షర్‌ను అట్టిపెట్టామని చెప్పాడు. మ్యాచ్ పరిస్థితికి తగినట్లు ఆడే సమయంలో ఎదురయ్యే సమస్యలు ఇలానే ఉంటాయన్నాడు. అయితే క్షర్‌ను కొచెం ముందుగా బ్యాటింగ్‌కు పంపి ఉంటే బాగుండేదేమో? అన్నాడు.
'మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌తో మొమెంటం పెంచాలి. ఒకరో లేదంటే ఇద్దరు ప్లేయర్లు 80+ స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఓవర్లలో మేం మరీ ఎక్కువ వికెట్లు కోల్పోతున్నాం. అది తీవ్రమైన ప్రభావం చూపుతోంది. మా సీనియర్ ప్లేయర్లు బాధ్యత తీసుకొని ఆడాలి. మాలో ఎవరో ఒకరు భారీ స్కోరు చేస్తే.. మిగతా మ్యాచ్ అదే పూర్తవుతుంది' అని చెప్పుకొచ్చాడు.