ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. అంతకుముందు హైదరాబాద్‌లో ఢిల్లీ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో సన్‌రైజర్స్ బదులిచ్చినట్లు అయింది. ఈ క్రమంలోనే ఈ థ్రిల్లింగ్ విక్టరీపై సన్‌రైజర్స్ సారధి ఎయిడెన్ మార్క్రమ్ స్పందించాడు.
'ఇదో గొప్ప టీం ఎఫర్ట్. ఈ గేమ్ కోసం మా వాళ్లు రెడీ అయిన విధానం చాలా బాగుంది. మా బ్యాటర్ల అప్రోచ్ కూడా ఫ్రెష్‌గా ఉంది. ఇక డెత్ ఓవర్లలో బౌలర్ల స్కిల్స్ సూపర్. మా బెస్ట్‌గా మేం ఆడుతున్నంత వరకు మైదానంలో అనుకున్నది జరగకపోయినా నాకు బాధ ఉండదు. ప్లేయర్ల అప్రోచ్ సరిగా ఉంటే ఫలితం ఎలా ఉన్న పర్లేదు. ఈ విషయం వాళ్లు అర్థం చేసుకున్నారు' అని మార్క్రమ్ చెప్పాడు.

ఇక తమ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. 'క్లాసెన్ చాలా గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో అభిషేక్ చూడచక్కని షాట్లతో అలరించాడు. కానీ చివర్లో సరిగా ఫినిష్ చేసే ప్లేయర్ అవసరం అయ్యాడు. క్లాసెన్, సమద్ మధ్య భాగస్వామ్యం చాలా గొప్పగా అనిపించింది. క్లాసెన్ ఒక టైప్‌లో ఆడతాడు. అలా తనకు వచ్చినట్లు విధ్వంసం సృష్టించడం చాలా సంతోషంగా అనిపించింది' అని వివరించాడు.
ఛేజింగ్‌లో మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ మళ్లీ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. దీనిపై మాట్లాడిన మార్క్రమ్.. 'రెండు మంచి ఓవర్లు పడినా.. ఒక వికెట్ దక్కినా మళ్లీ మేం గేమ్‌లోకి వస్తాం అని తెలుసు. మయాంక్ అందుకున్న స్పెషల్ క్యాచ్‌తో మేం మళ్లీ ఆటలోకి వచ్చాం. మా బౌలర్లు అద్భుతమైన కేరక్టర్ చూపించారు. ఒక్కో మ్యాచ్‌పైనే ఫోకస్ పెడుతున్నాం. అదే సమయంలో మాకు కొన్ని విజయాలు కూడా అవసరం. వచ్చే మ్యాచ్‌లో కూడా ఇలాగే రాణిస్తామని అనుకుంటున్నా' అని పేర్కొన్నాడు.