ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అదరగొట్టాడు. ఆరంభంలో టపటపా వికెట్లు పడటంత జాగ్రత్తగా ఆడిన అతను ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో అతనిపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ తర్వాత పంజాబ్ టీంలో టాప్ స్కోరర్ శామ్ కర్రాన్. అతను 22 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రభ్‌సిమ్రాన్‌ను తెగ మెచ్చుకున్నాడు. అదే సమయంలో శామ్ కర్రాన్‌పై అసహనం వ్యక్తం చేశాడు.

'ప్రభ్‌సిమ్రాన్‌కు అవకాశాలు ఇవ్వడం ద్వారా పంజాబ్ కింగ్స్‌కు చాలా లాభం జరిగింది. ఇప్పుడు అతను నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్లేయర్ వల్ల పంజాబ్ కింగ్స్‌కు చాలా బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నా' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ఐపీఎల్‌లో మొదటి సారి ప్రభ్‌సిమ్రాన్ ఆడినప్పుడు అతన్ని రూ.4.8 కోట్లకు కొన్న విషయాన్ని కూడా గుర్తుచేశాడు.
అప్పుడు ప్రభ్‌సిమ్రాన్ పెద్దగా రాణించలేదు. 'ఈసారి అతన్ని కేవలం రూ.60 లక్షలకే కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అతను తన ట్యాలెంట్ చూపిస్తున్నాడు. తను సెంచరీలు కూడా చెయ్యగలనని నిరూపించాడు. అతని ధర రూ.60 లక్షలే అని గుర్తుంచుకోండి. అతనే ఇలా సెంచరీలు చేస్తూ మీ జట్టును కొన్ని మ్యాచులు గెలిపిస్తుంటే.. అంత కన్నా కావల్సింది ఏముంది? మరి అదే సమయంలో రూ.18.5 కోట్లు పెట్టి కొన్ని శామ్ కర్రాన్ మీ జట్టు కోసం ఏం చేస్తున్నాడు?' అని ప్రశ్నించాడు.

ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్‌తో కలిసి కర్రాన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ అతను పరుగులు చేసిన వేగం మాత్రం చాలా ఘోరంగా ఉంది. కనీసం బంతికి ఒక పరుగు కూడా చేయలేదీ ఇంగ్లండ్ స్టార్. చివరకు మనసు పెట్టకుండా భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అందుకే అతన్ని సెహ్వాగ్ విమర్శిస్తున్నాడు.