Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DCvsLSG : ఈ విజయాన్ని సీరియస్‌గా తీసుకోం: కేఎల్ రాహుల్

ఐపీఎల్ 16లో మూడో మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు మంచి స్కోరు చేసింది. కైల్ మేయర్స్ (78) ఆక్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌‌తో లక్నో బ్యాటింగ్ రూపురేఖలు మారిపోయాయి. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగుల భారీ స్కోరు చేసింది..

ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ జట్టు దారుణంగా విఫలమైంది. ఏ దశలోనూ ఆ జట్టు విజయం దిశగా సాగలేదు. ఢిల్లీ తరఫున వాళ్ల కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ అతను చాలా నెమ్మదిగా ఆడటంతో అతని ఇన్నింగ్స్ ఆ జట్టును ఒడ్డున పడేయలేకపోయింది ఈ క్రమంలో తమ విజయం గురించి కేఎల్ రాహుల్ విశ్లేషించాడు. తమ విజయానికి ఆ ఇద్దరే కారణం అని చెప్పాడు.

kl rahul lsg captain 2

'ఈ సీజన్‌కు ఇదొ గొప్ప ఆరంభం. ఈ పిచ్ గురించి మాకు ఏం తెలీదు. కానీ మాకు లభించిన ఆరంభం చాలా బాగుంది. ఈ విజయం మా జట్టుకు మంచి కాన్ఫిడెన్స్ అందిస్తుంది. కొత్త నిబంధనలతో మనం బలమైన జట్టుతో బరిలో దిగే అవకాశం ఉంటుంది. దీంతో బౌలింగ్, బ్యాటింగ్ రెండిట్లో మా జట్టు రాణించింది. మేం అనుకున్న దాని కన్నా 30 పరుగులు ఎక్కువ చేశామని నా అంచనా. కైల్ మేయర్స్ అద్భుతంగా ఆడాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎటా చేయాలని అనుకున్నాం. తద్వారా వాళ్లను ఒత్తిడిలోకి నెట్టాలనేదే మా ప్లాన్' అని రాహుల్ వివరించాడు.

అలాగే ఢిల్లీకి కూడా మంచి ఆరంభం లభించిందని, కానీ తమ జట్టు అద్భుతంగా పుంజుకుందని చెప్పాడు. 'ఇది వుడ్ రోజు అని చెప్పాలి. ఏ బౌలర్‌కు అయినా ఇలా రాణించాలనే ఉంటుంది. ఈ రోజు అతను అద్భుతంగా సత్తా చాటాడు. ఓవరాల్‌గా మా బౌలింగ్ యూనిట్ చక్కగా బౌలింగ్ చేసింది. దీంతో ఢిల్లీ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. ఈ విజయాన్ని మరీ సీరియస్‌గా తీసుకోవాలని అనుకోవడం లేదు. కానీ ఈ కాన్ఫిడెన్స్‌తో తర్వాతి మ్యాచ్‌లో అడుగు పెడతాం. ఇది టీ20 క్రికెట్ కదా.. కాబట్టి ప్రతి రోజూ కష్టపడి, పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ విజయం గురించి అంత ఎక్కువ ఆలోచించడం లేదు' అని రాహుల్ చెప్పాడు.

Story first published: Sunday, April 2, 2023, 7:52 [IST]
Other articles published on Apr 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+