లీగ్ దశలో చెన్నై తన చివరి మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ముందుగా బ్యాటింగ్ చేస్తుందని ధోనీ చెప్పాడు. అలాగే తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని, కోల్‌కతాతో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని తెలిపాడు.
మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ మరింత నెమ్మదించే అవకాశం ఉందని, అందుకే ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నామని ధోనీ చెప్పాడు. ఈ క్రమంలోనే టాస్ ఓడిన డేవిడ్ వార్నర్ తాము నిలకడగా ఆడాలని నిర్ణయించుకున్నామని, ఈరోజు ఎలాగైనా చెన్నై పార్టీని చెడగొట్టాలని అనుకుంటున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ స్పెషల్ రెయిన్‌బో జెర్సీలో ఆడుతున్న సంగతి తెలిసిందే.

తమ జట్టులో రెండు కీలక మార్పులతో బరిలో దిగుతున్నామని వెల్లడించాడు. లలిత్ యాదవ్ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడని చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్‌లో యంగ్ ప్లేయర్ యష్ ధుల్ కూడా ఆడుతున్నట్లు తెలియజేశాడు. ఢిల్లీ చివరగా ఆడిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన రైలీ రూసోపై ఈ మ్యాచ్‌లో కూడా అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి అతను ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), యష్ ధుల్, ఫిల్ సాల్ట్, రైలీ రూసో, అమన్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ఆన్రిచ్ నోకియా
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, శివమ్ దూబే, మొయీన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ